31 వేళ్ళతో పుట్టిన శిశువు

Baby Born With 31 Fingers

04:04 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Baby Born With 31 Fingers

సాధారణంగా మనిషి కాళ్ళకి,చేతులకు కలిపి 20 వేళ్లుంటాయి, కొందరికీ అరుదుగా ఇంకో రెండు వేళ్ళు అంటే మొత్తం 22 వేళ్లుంటాయి. కొందరిలో మరోవేలు ఎక్కువగా ఉండొచ్చు. కానీ చైనాలో పుట్టిన ఓ పసిపాపకు మాత్రం రెండు చేతులకు కలిపి 15 వేళ్లు , రెండు కాళ్లవి కలిపి 16 వేళ్లు ఉన్నాయి. అంటే మొత్తంగా ఆ చిన్నారి 31 వేళ్ళతో పుట్టింది.ఇది ఇలా ఉంటే అధికంగా ఉన్న ఆ వేళ్ళను తొలగించేందుకు ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పడంతో , ఆపరేషన్ కోసం ఆ చిన్నారి కుటుంబం విరాళాలు సేకరిస్తోంది.

ఇవి కూడా చదవండి:మంటతో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు

31 వేళ్ళున్నఈ చిన్నారికి "పోలిడాక్టిలిజమ్" అనే వ్యాధితో బాధపడుతున్నాడని డాక్టర్లు తేల్చారు . చిన్నారి తల్లి నుంచి ఈ వ్యాధి ఆ చిన్నారికి సంక్రమించింది. ఇప్పుడు ఆ చిన్నారికి ఆపరేషన్ చెయ్యాలంటే 30 వేల డాలర్లు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో , పేద కుటుంభం అయిన వారు చేసేది లేక ఇప్పుడు చిన్నారి కుటుంబం కొన్ని చారిటీ సంస్థల నుంచి ఆన్ లైన్ లోనూ విరాళాలు సేకరిస్తోంది. ఈ చిన్నారికి త్వరలోనే ఆపరేషన్ జరిగి వేగంగా కోలుకోవాలని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి:24 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:ఈ పార్క్ కి న్యూడ్‌గానే వెళ్ళాలట

English summary

A Baby Born with 31 Fingers in China, He born with has 15 fingers and 16 toes, with two palms on each hand and no thumbs.