పసికందుని పొట్టన పెట్టుకున్న ఆక్రమణల తొలగింపు

Baby Dies While 500 Shanties Were Demolished In Delhi

01:24 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Baby Dies While 500 Shanties Were Demolished In Delhi

ఢిల్లీలో రైల్వే అధికారులు చేపట్టిన అక్రమ గృహాల తొలగింపులో అపశ్రుతి జరిగింది. ఒక ఆరు నెలల వయసున్న పసికందు మృతి చెందింది.

వివరాల్లోకి వెళ్తే పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో అక్రమంగా ఆక్రమించిన ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయించే పనిలో భాగంగా రైల్వే పోలీసులు ఒక బస్తీలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఆరు నెలలు పసికందు మృతి చెందింది.

ఈ గుడిసెల తొలగింపులో భాగంగా మొత్తం 500 మంది ప్రజలు రోడ్డున పడ్డారు. ఆ బస్తీలోని ప్రజలు మాట్లాడుతూ తమ నివాసాలను అక్రమంగా కూల్చివేసారని,ఎటువంటి నోటీసులు జారీ చెయ్యకుండా తమ గుడిసెలను తొలగించారని... ఆ క్రమంలోనే ఆరు నెలల పసికందు మృతి చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేసారు.

ఇది ఇలా ఉంటే రైల్వే అధికారులు మాత్రం వారి వ్యాఖ్యలను ఖండించారు. ఇంతకు మునుపు వారికి చాలా సార్లు వారిని ఖాళీ చెయ్యమని నోటీసులు పంపించామని చెప్పారు. పసికందు మృతి పై రైల్వే అధికారులు మాట్లాడుతూ గుడిసెల తొలగింపు కార్యక్రమం ప్రారంభం కాక ముందే పసికందు మరణించిందని, పసికందు కుటుంభ సభ్యులు బట్టలు సర్దుతుండగా బట్టల కుప్ప పడి చనిపోయిందని చెప్పుకొచ్చారు.

దీని పై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇది చాలా భాధాకరమైన ఘటనని దీనికి కారణమైన వారిని దేవుడు క్షమించడని అన్నారు. ఈ ఘటనతో సంభందం ఉన్న ముగ్గురు సీనియర్‌ అధికారులను సస్పెండ్‌ చేసారు. కేజ్రీవాల్‌ వారందరికి ప్రభుత్వం తరపున ఇళ్ళు కట్టిస్తామని హామి ఇచ్చారు. రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుకు కూడా ఈ ఘటన గురించి తెలియదని ,ఈ విషయం తెలుసుకున్నాక ఆయన కూడా షాక్‌కు గురయ్యానని కేజ్రీవాల్‌ అన్నారు.

English summary

A six-month-old baby died in west delhi,while the goverenment of delhi ordered to demonish 500 shanties in delhi slum