పసికందును చర్చిలో వదిలేసారు.

Baby Girl Abandoned In Church In USA

03:32 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Baby Girl Abandoned In Church In USA

చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన పసికందులను వదిలేయడం, ఆడపిల్ల పుట్టిందని ఆసుపత్రిలోని వదిలివెళ్ళిపోవడం లాంటి ఘటనలు మన ఇండియాలోనే అనుకున్నాం కానీ ఇప్పుడు సరిగా అలాంటి ఘటన యుఎస్‌లోని ఒక చర్చిలో కూడా జరిగింది. న్యూయార్‌ సిటీ చర్చి మేనేజర్‌కు చర్చిలో పసికందు ఏడుపు వినిపించగా వెళ్ళి చూడగా అప్పుడే పుట్టిన ఒక పసిబిడ్డ కనిపించింది. గుర్తు తెలియని వారు ఎవరో ఆ పసికందును అక్కడ వదిలివెళ్ళినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ పసిపాపకు అప్పుడే పుట్టినట్లుగా పాప కడుపుకు బడ్డుతాడు కూడా ఇంకా విడదీయలేదట. అప్పుడే పుట్టిన పాపను అంత దారుణమైన స్థితిలో వదిలివెళ్ళిన తల్లిదండ్రులకోసం పోలీసులు గాలింపులు జరుపుతున్నారు.

English summary

New Born Baby Girl Abanded In Church In USA. An unknown person leaves baby in the church. Newyork Police files the case and investigating the case that the baby belongs to whom