ఆ పసికందుకు జైల్లోనే  పేరు పెట్టారు 

Baby Names In Jail

06:03 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Baby Names In Jail

అవును, జైళ్ళు శిక్షా గారాలు గా కాకుండా సంస్కరణ నిలయాలుగా ఉండాలనే నినాదానికి అనుగుణంగా ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానీ సబ్‌-జైలు సిబ్బంది ఓ కొత్త సంప్రదాయాన్ని నడిపిస్తున్నారు. ఓ మహిళా ఖైదీ ప్రసవించిన పసికందుకు జైలులోనే సంప్రదాయబద్ధంగా నామకరణ ఉత్సవాన్ని అధికారులు జరిపించారు . హల్‌ద్వానీ సబ్‌-జైలులో ఓ మహిళకు పది రోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్‌ పసికందుకు జైల్లోనే నామకరణ కార్యక్రమం నిర్వహించి గ్రామస్థుల సమక్షంలో వైభవంగా ఆ బాలుడికి పేరు పెట్టారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచారు.

అయితే ఇలాంటివి జరగడం ఇది మొదటి సారి కాదండోయ్. గత రెండు నెలల్లో ఇది రెండో సంఘటన ఇది. ప్రస్తుతం జైలులో ముగ్గురు పిల్లలు తల్లులతో కలిసి నివసిస్తున్నారు. జైలు పాలనాధికారులు ఖైదీలలో సానుకూల దృక్పథం పెంపొందించడం కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నారు. స్పీకర్లు ఏర్పాటు చేసి అన్ని మతాలకు చెందిన భక్తి గీతాలు వినిపిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్తల చేత ప్రసంగాలు ఇప్పిస్తున్నారు. మొత్తానికి జైళ్ళు సరికొత్త పంధాను అనుసరిస్తున్నాయి.

English summary