చనిపోయిందన్న పసికందు బతికేసింది

Baby Pronounced Dead Comes Back to Life

09:27 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Baby Pronounced Dead Comes Back to Life

వింత అనేది ఏ రూపంలో చోటు చేసుకుంటుందో చెప్పలేం.... ప్రపంచంలో నిత్యం ఎక్కడో అక్కడ వింత జరగడం పరిపాటి. అరుదైన ఈ వింతల్లో ఆశ్చర్యం గొలిపే ఘటన చైనాలో జరిగింది. అదేమంటే , చనిపోయిందని సమాధి చేయబోతుండగా ఓ పసికందులో చలనం వచ్చిందట. ఇంకేముంది ఆ తల్లిదండ్రులు అంత్యంత ఉత్సాహంతో, వెంటనే ఆ బిడ్డను ఆస్పత్రిలో చేర్పించారు. పసికందుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

చనిపోయిందనుకున్న బిడ్డ బతికే ఉండడంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వివరాల్లోకి వెళితే,

చైనాలోని జీజాంగ్‌ ప్రావిన్స్‌కి చెందిన ఓ యువ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. నెలలు నిండకుండా ఆ బిడ్డ పుట్టడం వలన 23రోజుల పాటు ఇంక్యుబేటర్‌లో పెట్టారట. చైనా నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని తల్లిదండ్రులు ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకున్నారు. అయినా ఫలితం లేదు సరికదా, బిడ్డ ఆరోగ్యం క్రమేపి క్షీణించడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. ఫలితం దక్కలేదు. ఫిబ్రవరి 4న బిడ్డ చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. రాత్రి సమయం కావడంతో బిడ్డను మెత్తటి తువ్వాళ్లలో చుట్టి మార్చురీలో ఉంచాడట తండ్రి. మర్నాడు ఉదయం అంత్యక్రియలు జరిపించడానికి ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఇక సమాధి చేస్తున్న సమయంలో బిడ్డ కదలడం, ఏడవడం గమనించిన సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంకేముంది ఆనడంతో ఆ బిడ్డను ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ మిరాకిల్ ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.

English summary

A baby was declared dead and at the creamation ground that baby comes alive.Thsi weird incident was occured in Bejing in China.Due to their baby came alive that baby parents feel happy