పిల్లల ఏడుపుకి.. యాప్ అర్థాలు..!

Baby translator App

06:55 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Baby translator App

చిన్నపిల్లలు.. ఆకలి వేసినా.. ఏ బాధ కలిగినా.. ఏడుపుతోనే చెపుతారు. మాటలురానీ వారు తమ భావాలను వ్యక్తం చేయానికి ఏడుపునే ఆశ్రయిస్తారు. అయితే పసిపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో చాలా మందికి అర్థం కాదు. ఆకలివేస్తోందా.. లేక టాయిలెట్కు వెళ్లాలా... లేక ఇంకేమైనా బాధ ఉందా అనేది అర్థంకాక, వారి ఏడుపు ఆపాలంటే ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికోసమే తైవాన్‌కు చెందిన పరిశోధకులు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పే యాప్‌ను రూపొందించారు. నేషనల్‌ తైవాన్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ యున్లిన్‌కు చెందిన పరిశోధకులు ఇన్‌ఫాంట్‌ క్రైస్‌ ట్రాన్స్‌లేటర్‌ను తయారు చేశారు. రెండేళ్లు పరిశోధన చేసి శిశువుల ఏడుపు శబ్దాలను రికార్డు చేసి వాటిపై పరిశోధన చేశారు. ఏడుపు శబ్దాలను నాలుగు రకాలుగా విభజించారు. ఈ శబ్దాలను వారు పొందుపరిచిన డేటాబేస్‌తో పోల్చిచూస్తారు. ఇందుకోసం క్రైయింగ్‌ బేబీ మొబైల్‌ యాప్‌ను తయారు చేశారు. రెండేళ్ల కాలంలో వంద మంది నవజాత శిశువల నుంచి 2 లక్షల శబ్దాలను సేకరించారు. వారు తయారు చేసిన మొబైల్‌ యాప్‌ అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి రెండు వారాల లోపు వయస్సున్న వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. యాప్‌ ద్వారా శిశువు ఏడుపు శబ్దాన్ని రికార్డు చేస్తే 15 సెకన్లలో వారు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పేస్తుంది. ఆకలి, నిద్ర, బాధ, డైపర్‌ తడవ్వడం ఈ నాలుగు అంశాల్లో ఏదో గుర్తించగలదు. రెండు వారాల లోపు పిల్లల్లో యాప్‌ దాదాపు 90శాతం కచ్చితంగా పనిచేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. అదే రెండు నెలలలోపు పిల్లల్లో అయితే 85శాతం పనిచేస్తుందట. యాప్‌ కచ్చితంగా పనిచేస్తే చిన్నారుల ఏడుపు మాన్పించడంలో తల్లిదండ్రులకు ఎంతో హెల్ప్ అవుతుంది.

English summary

A new smart phone app has been released by National University of Taiwan Researchers named "Baby translator" with the use of this app we can know the reason for what baby was crying for