అమ్మో! వీటివలన కూడా క్యాన్సర్ వస్తుందట..

Bacon and coffee causes cancer

11:51 AM ON 24th October, 2016 By Mirchi Vilas

Bacon and coffee causes cancer

అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ, ఆడపిల్ల కాదిది కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ... కానీ అదీ ఇదీ అని లేదు క్యాన్సర్ సోకడానికి ఏదైనా కారణం అయ్యే పరిస్థితి వచ్చేసింది. మీరు చిక్కటి చక్కని కాఫీ, ప్రాసెస్డ్ మీట్ తెగ తినేస్తేున్నా, అతిగా సెల్ ఫోన్ మాట్లాడుతున్నారూ అంటే... మీరు క్యాన్సర్ బారిన పడటం ఖాయమంటున్నాయి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(IARC) పరిశోధనలు. గ్లోబల్ లైఫ్ స్టయిల్ లో మార్పు తెస్తున్న అంశాలు అనే విషయం పై(IARC) షాకింగ్ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం మీరు అతిగా కాఫీ తాగినా, మితిమీరి ప్రొసెస్డ్ మీట్ తిన్నా, అదే పనిగా సెల్ ఫోన్ మాట్లాడినా.. క్యాన్సర్ వచ్చే ప్రమాదముందంటున్నాయి పరిశోథనలు.

అయితే(IARC) ప్రచురించి ఈ విషయాలపై నిజానిజాల పై సమీక్ష జరపాలని యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజలకు అనారోగ్యాన్నికలిగించే విషయాలపై దృష్టి సారించిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ క్యాన్సర్ ఏజెన్సీ ఈ విషయాన్ని కూలంకషంగా గమనిస్తోంది. అంతే కాకుండా ఏ పదార్ధాలు ఏ మేరకు వాడితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదుమందనే విషయాల పై నిశితంగా పరిశీలన జరపాలని ఆదేశించింది. అంతే కాకుండా ఆయా పదార్ధాలు ఏ విధంగా క్యాన్సర్ కారణమౌతాయనేది సవివరంగా తెలియచేయాలని యూఎస్ ప్రభుత్వం కోరింది.

1/2 Pages

కాగా మోతాదుకు మించిన కాఫీ, అతిగా తిని మాంసాహారం, గంటల తరబడి సెల్ ఫోన్లలో మాట్టాడం వల్ల వీటిలో ఉండే గ్లైఫోసేట్ అనే మూలకం క్యాన్సర్ కారకమౌతుందని పరిశోథనల్లో తేలిందని నివేదికలు చెబుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త.

English summary

Bacon and coffee causes cancer