'సర్దార్' కు ఘోర అవమానం: ధియేటర్ లో పది మంది కూడా లేరు

Bad position for Pawan Kalyan

12:24 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Bad position for Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల ఈలలు, కేకలతో థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ కౌటౌట్ లతో థియేటర్స్ ని కొత్త పెళ్లి కూతురులా అందంగా ముస్తాబు చేస్తారు అభిమానులు. మొదటి రోజే టిక్కెట్లు దొరికే సమస్యే లేదు. ఫ‌స్ట్ వీక్‌లో ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలంటే కాస్త క‌ష్ట‌మైన ప‌నే.. రిస్క్ చేయాల్సిందే. అలాంటి పవన్ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో పట్టుమని పది మంది కూడా లేరు. అవును మీరు వింటుంది నిజం.

కాకపోతే.. ఈ దుస్థితి మన తెలుగు సర్దార్‌కు కాదు. హిందీ స‌ర్దార్‌కు జ‌రిగిన ఘోర అవ‌మానం. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాను తెలుగు తో పాటు.. హిందీ లో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీ డ‌బ్బింగ్ హ‌క్కుల్ని ఈరోస్ సంస్థ 12 కోట్ల‌కు కొనుక్కుంది. మరో 4 కోట్లు పెట్టి పబ్లిసిటీ కూడా చేసింది. తీరా థియేటర్ల‌లో జ‌నాలే లేర‌ట‌. మొదటి వారంలో కాస్త అటూ ఇటూగా జ‌నాలు వ‌చ్చినా మొదటి వారం ముగిశాక థియేట‌ర్ల‌లో ఈగ‌లు తోలుకోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంద‌ట‌. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇంత కంటే ఘోరమైన అవమానం ఎదురవుతుందని ఎవరూ ఊహించి ఉండరేమో!

English summary

Bad position for Pawan Kalyan. Even 10 memebers also not their in Sardar Gabbar Singh hindi version movie.