బాహుబలి 2 ఫస్ట్ లుక్ విడుదల సమయం ఇదే

Bahubali 2 First Look To Be Released on 22nd October

11:31 AM ON 20th October, 2016 By Mirchi Vilas

Bahubali 2 First Look To Be Released on 22nd October

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత చాటిన బాహుబలి కి కొనసాగింపుగా తీస్తున్న చిత్రం బాహుబలి 2 సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరో ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబరు 22న ముంబయి ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎన్ని గంటలకు విడుదల చేస్తున్న విషయాన్ని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం థియేట్రికల్ , శాటిలైట్ హక్కులు భారీ మొత్తంలోఇప్పటికే అమ్ముడు పోయాయి. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 22 సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు బాహుబలి చిత్ర బృందం ట్వీట్ చేసింది.

English summary

Bahubali movie was created sensation National Wide and the movie was attracted many people from all over the world and now the time to see the first look of Bahubali-2 movie and now the first look was going to be released on October 22nd on the occassion of Prabhas Birthday.