2016లో బాహుబలి- 2 లేదట!!

Bahubali-2 is not releasing in 2016

02:47 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Bahubali-2 is not releasing in 2016

రాజమౌళి సృష్టించిన దృశ్య కావ్వం బాహుబలి. ప్రపంచవావ్యప్తంగా ఎన్నో ప్రశంసలు పొందిన ఈ చిత్రం విడుదలై దాదాపు 5 నెలలు కావొస్తుంది. ఇందులో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని బాహుబలి-2 లో చూపిస్తామన్నారు. బాహుబలి రీలీజయ్యాక రెండు నెలలు విశ్రాంతి తీసుకుని మళ్లీ ఘాటింగ్‌ మొదలు పెట్టేస్తామన్న రాజమౌళి బాహుబలి-2 ఘాటింగ్‌ని ఇంకా సెట్స్ పైకి తీసుకువెళ్లలేదు, ఇంకా లొకేషన్లు చూసే పనిలోనే ఉన్నాడు. సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు విడుదల చేస్తారో అన్న ఆలోచన అందరికీ నెలకొంది. ఇదిలా ఉండగా నిన్న జరిగిన 'భలేమంచిరోజు' ఆడియో ఫంక్షన్‌కి మహేష్‌తో పాటు రానా కూడా ముఖ్య అతిధిగా విచ్చేశారు.

అక్కడ యాంకర్‌ సుమకి కూడా బాహుబలి విడుదల తేదీ పై అనుమానం రావడంతో అక్కడికి వచ్చిన రానాని సుమ అదే ప్రశ్న అడగగా ఈ ప్రశ్నకు వచ్చే ఏడాది కూడా సమాధానం దొరకకపోవచ్చని రానా బదులిచ్చాడు. అంతకు మించి ఇంకేమి మాట్లాడలేదు కాని 2016 లో బాహుబలి-2 లేదని కుండ పగలగొట్టినట్లు చెప్పేశాడు. బాహుబలి విడుదలతో పాటు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న సుమ రానాని అడిగితే ఆ విషయం చెబితే రాజమౌళి నన్ను చంపేస్తాడని రానా నవ్వుతూ చెప్పాడు.

English summary

Bahubali-2 is not releasing in 2016 because shooting is not yet started.