బాహుబలి-2కి డేట్‌ ఫిక్స్‌!!

Bahubali 2 shooting starts on December 15

04:01 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Bahubali 2 shooting starts on December 15

బాహుబలి రిలీజై దాదాపు 5 నెలలు కావొస్తుంది. దానికి సీక్వెల్ బాహుబలి-2 సెట్స్ పైకి ఇంకా వెళ్లలేదు. బాహుబలి రిలీజయ్యాక రెండు నెలలు గ్యాప్ తీసుకుని ఆ తరువాత ఘాటింగ్‌ స్టార్ట్ చేస్తామని చెప్పాడు రాజమౌళి కానీ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు దానికి సమాధానం దొరికేసినట్టే, డిసెంబర్‌ 15 నుండి ఈ సిసిమా ఘాటింగ్‌ మొదలవుతుందని సమాచారం. నిర్మాంతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇంతవరకు ఘాటింగ్‌ ప్రారంభించలేదు. నవంబర్‌ లోనే ఘాటింగ్‌ మొదలు పెట్టాల్సి ఉంది కానీ ప్రీ-ప్రొడక్షన్‌ పనులుకి అనుకున్న టైమ్‌ కంటే ఎక్కువ సమయం తీసుకుంది.

ఇప్పుడు బాహుబలి-2 ఘాటింగ్‌ డిసెంబర్‌ 15న మొదలు పెట్టి 2016 జూలై కల్లా పూర్తి చెయ్యాలని రాజమౌళి ప్లాన్. బాహుబలి లో నటించిన పాత్రలే చాలా వరకు సీక్వెల్ లో కూడా ఉంటాయని చెప్పారు. బాహుబలి ఘాటింగ్‌ అప్పుడే సీక్వెల్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరిగిపోయాయి, ఇప్పుడు తీసే ఘాటింగ్‌ 70 శాతం ప్రభాస్‌, అనుష్క, సత్యరాజ్‌లపైనే ఉంటుంది అని స్పష్టంగా చెప్పారు.

English summary

Bahubali 2 shooting starts on December 15 directing by S.S.Rajamouli. and in the lead characters Prabhas and Anushka.