బాహుబలి రేటు చూస్తే బెంబేలు

Bahubali 2 Tamil Right Costs 54 Crores

11:56 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Bahubali 2 Tamil Right Costs 54 Crores

తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సొంతం చేసుకున్న బాహుబలి ఫీవర్ ఇంకా కొనసాగుతోంది. కంక్లూజన్ పేరిట పార్ట్ -2 కూడా సిద్ధం చేయడంలో జక్కన్న బిజీ అయ్యాడు. ఇప్పటికే బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ పాత రికార్డులను తుడిచిపెట్టి కొత్త రికార్డులను సృష్టించి, తొలి భాగానికి దీటుగా రెండో భాగానికి కూడా రాజమౌళి నగిషీలు చెక్కుతున్నాడు.

ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా సాగుతుంటే, ఇక బిజినెస్ పరంగా అదర గొట్టేస్తోంది. ప్రీ బిజినెస్ లోనే బాహుబలి - ది కంక్లూజన్ కొత్త రికార్డులు నెలకొల్పేలా కనిపిస్తోంది. అందుకే రెండో భాగం రేట్ చూసి పంపిణీదారులు బెంబేలెత్తిపోతున్నారట. కేవలం తమిళ హక్కులకే అక్షరాలా 54 కోట్లు చెల్లించుకోవాలట. ఈ హక్కలు ఆడియో, శాటిలైట్ కలుపేనని తెలుస్తోంది. తొలి భాగాన్ని స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి తమిళంలో విడుదల చేసిన ప్రభాస్ సన్నిహితుల సంస్థ అయిన యువీ క్రియేషన్స్ తాజా రేటు తెలిసి, తీసుకోవాలా..? వద్దా..? అనే దానిపై కంక్లూజన్ కి రాలేకపోతున్నారట. ఈ విషయంలో ప్రభాస్ తన స్నేహితులకు ఏమైనా సాయపడతాడా లేక రాజమౌళి అండ్ కో కు వంత పాడతాడా అన్నది అప్పుడే చెప్పలేం. ఏమైనా.. రెండో భాగం రేటు పరుగులు పెట్టడం, డిస్త్రిబ్యూటర్లను బెంబేలెత్తిస్తోంది.

ఇవి కూడా చదవండి:జనతా గ్యారేజ్ వాయిదాకు కారణం ఏంటబ్బా!

ఇవి కూడా చదవండి:సూపర్ స్టార్ చెప్పినా తగ్గలేదట..

English summary

Bahubali Movie Created New Records in Indian Film Industry and the Sequel of this movie was shooting was going fastly and this Bahubali 2 Movie Tamil rights cost was going high, according to recent news that Tamil costs a Huge Amount of 54 crores.