'బహుబలి'లోఈ సారి 3000 మందితో యుద్ధం!

Bahubali-2 war sequence shooting with 3000 people

01:02 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Bahubali-2 war sequence shooting with 3000 people

ఎస్‌.ఎస్‌. రాజమౌళి సృష్టించిన వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి'. ఈ చిత్రంతో తెలుగు సినిమా గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పాడు. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం కాసుల పంట రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపు 'బాహుబలి ద కన్‌క్లూషన్‌' చిత్రం షూటింగ్‌ మొన్ననే (డిసెంబర్‌17) రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 'బాహుబలి ద బిగినింగ్‌'లో 40 నిముషాలు నిడివి గల యుద్ధం సన్నివేశాన్ని తెరకెక్కించినట్లే బాహుబలి-2 లో కూడా 40 నిముషాలు కంటే ఎక్కువ నిడివితో ఉన్న యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.

బాహుబలిలో 2000 మందితో యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించిన రాజమౌళి బాహుబలి-2 కోసం ఏకంగా 3000 మందితో రెండు నెలలు పాటు యుద్ధసన్నివేశాన్ని రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తారట.
మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్చీవిలాస్.కామ్

English summary

Bahubali-2 war sequence shooting with 3000 people in Ramoji Film City upto 2 months.