ఫిలిప్పీన్స్ లో బాహుబలి పరీక్షలు

Bahubali Exam In Philippines

06:13 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Bahubali Exam In Philippines

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం భారత చలన చిత్ర రికార్డులను తిరగరాసిన విషయం అందరికి తెలిసిందే. బాహుబలి సినిమాకు ఇప్పటికే అనేక అవార్డులు దాసోహం అయ్యాయి . భారత దేశంలోనే కాక దేశ విదేశాలలో కూడా బాహుబలి క్రేజ్ ఇంకా తగ్గనట్లే కనిపిస్తుంది. ఈ సినిమాను అనుకరించి బాహుబలి మీద యూట్యూబ్ లో వివిధ రకాలైన స్పూఫ్ లతో సందడి చేస్తునే ఉన్నాయి. వివిధ ఆన్ లైన్ వ్యాపార వెబ్ సైట్లలో కట్టప్ప గురించి వెతకడం , ఇంటర్నెట్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దాని గురించి వెతకడం వంటి వాటిలో ఇంకో వింత చేరింది. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ఫిలిప్పీన్స్ దేశంలో నిర్వహించిన ఒక పరీక్షలో బాహుబలి సినిమా కథను తీసుకుని దాని పై ఏకంగా వివిధ రకాలైన ప్రశ్నలను రూపొందించారు. ఇప్పుడు ఈ వార్త ఇంటర్నెట్ లో హాల్-చల్ చేస్తున్న ఈ ట్వీట్ ను మీరు ఓసారి చుడండి.

English summary

Bahubali Movie Craze crosses borders. Some Questions were asked based on Baahubali Movie in an exam in Philippines.Now this topic was trending in Twitter.