హాలీవుడ్ లెవెల్లో 12వ స్థానం కొట్టేసిన బాహుబలి

Bahubali Movie Listed In Top Wished Movies Of Hollywood

11:36 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Bahubali Movie Listed In Top Wished Movies Of Hollywood

టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లో కూడా బాహుబలి ఓ ఊపు ఊపేసింది. కలెక్షన్స్ కురిపించడంతో పాటు తొలిసారి జాతీయ స్థాయిలో అవార్డు కొట్టిన టాలీవుడ్ మూవీగా రికార్డుకెక్కింది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ బాహుబలి చిత్రం మరో రికార్డు సొంతం చేసుకుంది. హాలీవుడ్ స్థాయిలో టాప్ 15 చూడదగిన సినిమాల్లో కూడా స్థానం సంపాదించుకుంది. ప్రముఖ హాలీవుడ్ ఆన్ లైన్ పోర్టల్ స్క్రీన్ రాంట్ నిర్వహించిన సర్వేలో బాహుబలికి 12వ స్థానం లభించింది. ఈ పోర్టల్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 సినిమాలను పరిశీలించి జాబితాను తయారు చేస్తుంది. బాహుబలితోపాటు థాయ్ లాండ్ కు చెందిన ఆంగ్ బ్యాక్ , బ్రెజిలియన్ మూవీ ది సిటీ ఆఫ్ గాడ్ , ఫ్రెంచ్ సినిమాలు అమేలీ ,అఖిరా కురోసవా జపనీస్ క్లాసిక్ రాన్ చిత్రాలు కూడా స్థానం దక్కించుకున్నాయి. దీంతో మరోసారి జక్కన్నకు అభినందనల వెల్లువ వస్తోంది. ఇక బాహుబలి కంక్లూజన్ మరింత ఆకట్టుకునేలా శ్రమిస్తున్న సంగతి తెల్సిందే.

ఇవి కూడా చదవండి:అధికారులను ఇంట్లో బంధించిన కేంద్రమంత్రి

ఇవి కూడా చదవండిమాలో బెస్ట్ సింగరెవరంటున్న వర్మ (వీడియో)

English summary

Tollywood Top Director S.S.Rajamouli was presently busy with Bahubali-2 movie and this movie was going to be released in 2017. Bahubali part-1 was created records in National wide and this movie got many awards also. Recently Bahubali movie got place in Top 15 movie of Hollywood Wished list Movies to watch. This movie stands in 12 position.