పరేడ్‌లోనూ బాహుబలే

Bahubali Orientation In Republic Day Parade

03:36 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Bahubali Orientation In Republic Day Parade

2015 లో విడుదలైన బాహుబలి సంచలన విషయం సాధించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రజలందరిని ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ఇది. బాహుబలి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా స్పూర్తిలో వినాయక చవితికి బాహుబలి విగ్రహాలు తయారుచేశారు. అటు సోషల్‌ మీడియాలో కూడా బాహుబలి స్పూఫ్‌లు హల్‌చల్‌ చేశాయి. ఇప్పటికి కూడా బాహుబలి ప్రభావం ఏమాత్రము తగ్గలేదు. తాజాగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో కూడా బాహుబలి ప్రభావం బాగా కనిపించింది. సికింద్రాబాద్‌ లో పెరేడ్‌ గ్రౌండ్స్‌ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక వ్యక్తి బాహుబలి స్టిల్‌ను ప్రదర్శించాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ లా శివలింగాన్ని భుజం పైకి ఎత్తుకుని బైక్‌ మీద నిల్చుని అతను విన్యాసం చూసి అందరూ ఆకర్షితులయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల మొత్తానికి ఆయనే ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. దీంతో బాహుబలి సినిమా ప్రజల్లో ఎంతగా ముద్ర వేసుకుందో అర్దమవుతుంది. ఈ సినిమా రాజమౌళి కీర్తిని మరింత పెంచింది. ఈ సినిమా రాజమౌళికి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది. చివరికి గణతంత్ర దినోల్సవ వేడుకల్లో కూడా బాహుబలి స్థానం దక్కించుకోవడం పెద్ద విశేషం.

English summary

Bahubali which was created history in Indian cine was won many awards and rewards and the film director S.S.Rajamouli was also gets PAdma Sri award recently. Recently in Republic Day Parade in Secunderabad an Police Officer did Bahubali feet in the parade and he attracted all the people over there