బాహుబలి తరహాలో 'పెళ్లికి' సెట్‌!!

Bahubali range setting for Wedding in Kerala

04:44 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Bahubali range setting for Wedding in Kerala

బాహుబలి చిత్రం కోసం రామోజీ ఫిలింసిటీలో ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్ తో పెద్ద పెద్ద సెట్లే వేయించాడు రాజమౌళి. ఆ సెట్టింగ్సే నచ్చాయో, ఆ సినిమా ఏ నచ్చిందో మరి ఒక వ్యాపారవేత్తని ఇది ఆకట్టుకుంది. తన కూతురి పెళ్లికి కూడా ఆ తరహాలో సెట్లు వేయించాలనుకున్నాడు ఆ తండ్రి. ఇంతకీ ఎవరా వ్యాపారవేత్త? వివరాల్లోకెలితే కేరళకి చెందిన రవిపిళ్లై, ఇతను అరబ్‌ దేశాల్లో పెద్ద పారిశ్రామిక వేత్త ఒక ఎన్నారై, గల్ఫ్‌లో కనస్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రా డెవలెప్‌మెంట్‌, మైనింగ్‌, ఎడ్యూకేషన్‌ వంటి పెద్ద పెద్ద వ్యాపారాలకి అధిపతి. ఆర్‌పి గ్రూప్స్‌ సంస్థకు బాస్‌ 26 కంపెనీలు ఉన్న ఇతని ఆస్ధానంలో 80 వేల వర్కర్లు ఇతని దగ్గర పని చేస్తారు.

ఈయన కూతురైన డాక్టర్‌ 'ఆరతి' కి పెళ్లి నిశ్చయించాడు. అంతే తన కూతురి పెళ్లి కోసం సినిమా తరహాలో 55 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లి చేస్తున్నారు. కేరళలోని కొల్లంలో ఉండే ఆశ్రమ మైదానంలో గురువారం ఈ పెళ్లి జరుగుతుంది. దేశంలోనే అత్యంత గ్రాండ్‌గా ఈ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం బాహుబలి ఆర్ట్‌ డైరెక్టర్‌నే తన వద్దకు రప్పించుకున్నాడు. వెడ్డింగ్‌ సెట్స్‌ డిజైన్‌ పనులను సాబు సిరిల్ కి అప్పగించాడు. 200 ప్రొఫెషనల్‌ ఆర్టిస్టులతో 8 ఎకరాల్లో దాదాపు 20 కోట్లు రూపాయలతో ఈ పెళ్లి సెట్‌ని నిర్మిస్తున్నారు. తన కూతురిని కోచికి చెందిన డాక్టర్‌ 'ఆదిత్య విష్ణు'తో ఆరతి వివాహం వైభవంగా జరుపుతున్నారు.

అలాగే హీరోయిన్స్‌ మంజు వారియర్స్‌, శోభనలతో ట్రెడిషనల్‌ డ్యాన్స్‌ కార్యక్రమం పెట్టిస్తున్నారు. ఈ పెళ్లికి దాదాపు 42 దేశాల నాయకులు హాజరు కానున్నారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన సీఈఓలు, ప్రభుత్వ అధికారులు, పొలిటికల్‌ లీడర్లు, సినీతారలు, రాయబారులు ఎంతో మంది వస్తున్నారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌ నుంచి వీవీఐపీలకు కళ్యాణ మండపానికి 2 విమానాలని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొంత మంది కేంద్రమంత్రులు, రాయల్‌ ఫ్యామిలీలు చార్‌టెడ్ విమానాల్లో చేరుకున్నారు. గురువారం ఈ వివాహం ఇండియాలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా జరగబోతోంది.

English summary

Bahubali range setting for Wedding in Kerala. Businessman Ravi pillai who was MD for RP groups of industries conducting his daughter marriage as movie set type.