పనోరమలో 'బాహుబలి' కి చుక్కెదురు

Bahubali Rejects In Panorama Film Festival

05:41 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Bahubali Rejects In Panorama Film Festival

సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాక , కమర్షియల్ గా కూడా రికార్డు సృష్టించిన 'బాహుబలి' విదేశీ చిత్రోత్సవాల్లో చోటు సాధించి , తన హవాను కొనసాగిస్తుంటే , మన ఇండియాలో ప్రతిష్టాత్మకంగా 'పనోరమ' చిత్రోత్సవాలకు మాత్రం చుక్కెదురైంది. ఇటీవల బుసాన్‌ ఫిలిం ఫెస్టివల్లో మన సినిమాను ఒకటికి రెండుసార్లు ప్రదర్శిస్తే 5 వేల మంది పట్టే ఆడిటోరియం నిండిపోయింది. దర్శకుడు రాజమౌళికి అక్కడ స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది. మరికొన్ని చిత్రోత్సవాల్లోనూ 'బాహుబలి' ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐతే మన ఇండియాలో జరిగే ప్రతిష్టాత్మక 'పనోరమ' చిత్రోత్సవాలకు మాత్రం బాహుబలి పనికి రాకుండా పోవడమే కాకుండా, గోవాలో జరగనున్న వార్షిక ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) చిత్రోత్సవాలకు 'బాహుబలి' ఎంపికవ్వలేదు . దీంతో విమర్శలు ఊపందుకున్నాయి. ప్రాథమిక దశలోనే 'బాహుబలి'ని ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ సభ్యులు తిరస్కరించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కనీసం సెంట్రల్‌ కమిటీ పరిశీలనకు కూడా 'బాహుబలి' నోచు కాకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు.

బాహుబలి తిరస్కరణ విషయంలో జ్యూరీ సభ్యుల నిర్ణయం సరైనదేనన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి చిత్రాల్లో ఒరిజినాలిటీ అనేది ప్రధానాంశం అవుతుందని.. వేరే సినిమాల ఛాయలుంటే కూడా పరిగణించరని.. ఇక బాహుబలి లాంటి కమర్షియల్‌ హంగులున్న సినిమాను ఈ చిత్రోత్సవాలకు ఎంపిక చేస్తే వేరే సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో తిరస్కరించి ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.

బాహుబలి టేకింగ్‌ పరంగా.. వీఎఫ్‌ఎక్స్‌, సీజీ వర్క్‌ పరంగా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ.. కంటెంట్‌ విషయంలో మాత్రం వీగిపోయిందని, అందుచేత ఇలాంటి సాదాసీదా కథాంశాలకు చిత్రోత్సవాల్లో చోటు ఇవ్వలేదని ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ సభ్యుల్ని తిట్టడం కూడా సమంజసం కాదని విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం గా వుంది. మొత్తానికి రచ్చ గెలిచినా, బాహుబలికి ఇంట మాత్రం ఆదరణ లేదని అనుకోవాలా ? అయినా రావాల్సిన క్రెడిట వచ్చేసాక , ప్రక్షకుల ఆదరణ దండిగా ఉన్నాక , ఇలాంటి చిత్రోత్సవాలకు ఎంపిక కాకపొతే పోయే దేమిటిలే అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary

Bahubali Rejects In Panorama Film Festival