'హెరాల్డ్' లో సోనియా అండ్ కో కి బెయిల్ 

Bail Granted To Rahul And Sonia Gandhi

05:17 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Bail Granted To Rahul And Sonia Gandhi

దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకిత్తించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు బెయిల్ వచ్చేసింది. సోనియా ,రాహుల్ లతో పాటూ ఈకేసులో మొత్తం 7గురికీ బెయిల్ మంజూరైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది.

పూర్వపు జనతా పార్టీ అధ్యక్షుడు , ప్రస్తుత బిజెపి నేత డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వేసిన ఈ కేసులో బెయిల్ వద్దని డాక్టర్ స్వామి వాదించగా, బెయిల్ ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి , సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. పాటియాలో కోర్టులో నేషనల్ హెరాల్డ్ కేసును విచారించిన రెండో మెట్రోపాలిటన్ జడ్జి లవ్లీసింగ్ వాదనలు విన్న అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్‌కు 50వేల పూచీకత్తుతో బెయిల్ మంజారు చేశారు. ఈ కేసు రెండో విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసు విచారణను కేవలం 3 నిమిషాల్లోనే ముగియడం విశేషం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన సోదరి ప్రియాంక బెయిల్ బాండ్లను సమర్పించారు.

కేసు పూర్వాపరాలు .......

కేవలం 5 లక్షల పెట్టుబడితో 5 వేల కోట్ల రూపాయలు సొంతం చేసుకున్నారన్న డాక్టర్ స్వామి ఆరోపణపై కేసు నడుస్తోంది. కోర్టు కు హాజరవ్వాలని సామాన్లు పంపినా రాకపోవడంతో వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై హైకోర్టు ని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో బిజెపి వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ , పార్లమెంట్ ని కాంగ్రెస్ స్తంభింప చేసింది. శనివారం మధ్యాహ్నం కోర్టుకి సోనియా గాంధి , రాహుల్ గాంధి హాజరవ్వాలని నిర్ణయించడంతో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాటుచేసి , పక్కా నిఘా పెట్టారు. ఎస్పీజీ కమెండోల ఆధీనంలోకి కోర్టు ప్రాంగణం వచ్చింది. ఇక దేశంలో పలుచోట్ల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

కోర్టు దగ్గర ఉత్కంఠ .......

మధ్యాహ్నం సోనియా , రాహుల్ కోర్టుకి వస్తున్ననందున ముందుగానే అక్కడకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , అహ్మద్ పటేల్ , ఆజాద్ తదితరులు చేరుకున్నారు. మరోపక్క కేసు వేసిన డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు. ఆతర్వాత సోనియా , రాహుల్ , ఆస్కార్ ఫెర్నాండెజ్ , మోతీలాల్ ఓరా, సుమన్ దుబే తదితరులు కోర్టుకి వచ్చారు. ఏం జరుగుతుందోనని అంతా ఎదురు చూస్తున్న సమయంలో కేవలం మూడు నిమిషాల్లోనే బెయిల్ మంజూరైంది.

ఒత్తిళ్లకు భయపడేదిలేదన్న సోనియా .....

బెయిల్ మంజూరైన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింద ని సోనియా పేర్కొంటూ , ఎలాంటి ఒత్తిళ్లకు భయపడేది లేద న్నారు. రాజకీయ ప్రతీకార చర్యనూ ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. మా మార్గం నుంచి మమ్మల్ని ఎవరూ తప్పించలేర ని ఆమె చెబుతూ, దేశ పౌరులుగా ఏం చేయాలో అదే చేశామన్నారు. ఈ దేశంలో రాజ్యాంగం అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తుందని, అందులో తనకు ఎలాంటి సందేహం లేదని ఆమె అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం మాపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపిస్తూ , చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు.

అంగుళం కూడా వెనక్కి తగ్గమని అంటున్న రాహుల్ ....

రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మాపై తీవ్ర ఒత్తడి తేవాలని ప్రయత్నించారని పేర్కొంటూ, అయితే ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగేది లేదని స్పష్టం చేసారు. ప్రజల కోసమే మా పోరాటం కొనసాగుతుందన్నారు. మాపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రతిపక్షంగా మా పోరాటం కొనసాగిస్తామన్నారు. పేదలు , బడుగులకోసం చేస్తున్న తమ పోరాటంలో అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు.

ఒత్తిళ్ల ద్వారా ప్రతిపక్షాలను అణిచివేయలేదని మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన భావజాలాన్ని ఎప్పటికీ వదిలేయదన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. మొత్తానికి ఉత్కంఠ కు తాత్కాలికంగా తెరపడింది.

English summary

Today Sonia gandhi and Rahul gandhi and few othar congress party leaders appeared in court in national herald case. Court granted bail to them by taking 50000 Surety