వాడి ఇష్టానికే వదిలేస్తా...

Bala Krishna About His Son

11:21 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Bala Krishna About His Son

'నువ్వు అలా వుండు, ఇలా వుండు, ఈ పాత్ర చేయి ,ఆ పాత్ర వద్దు, ఇలా ఏదీ చెప్పను. వాడి ఇష్టానికే వదిలేస్తా ' అంటూ నందమూరి వంశంలో రాబోయే కొత్త హీరో మోక్షజ్ఞ గురించి తండ్రి బాలయ్య చెప్పిన మాటలివి. ఈ సంక్రాంతి కి విడుదలైన డిక్టేటర్ ఊహించిన దానికన్నా అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. సగటు ప్రేక్షకుడిని కూడా ఈ సినిమా ఆకట్టుకుందనే టాక్ నడుస్తోంది. ఫలితంగా ఈ సంక్రాంతి వచ్చిన హిట్ తో జోరుమీదున్న బాలయ్యతో ఓ టివి చానెల్ చిట్ చాట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా బాలయ్య వందో చిత్రంతో తెరంగేట్రం చేయనున్న కొడుకు మోక్షజ్ఞ కు ఎలాంటి పాత్రలు సజెస్ట్ చేస్తారన్న ప్రశ్నకు ఇచ్చిన జవాబు పైవిధంగా వుంది. 'ఏదో ఒకటి రెండు సినిమాలవరకు సూచనలు అందించడం సహజం. ఏదైనా వాడి ఇష్ట ప్రకారమే వుంటుంది' అని బాలయ్య చెప్పేసాడు. మరి మోక్షజ్ఞ ఈ స్వేచ్ఛను ఎలా వినియోగించు కుంటాడో చూడాలి.

English summary

In a tv interview nandamuri bala krishna says that he did not oppose his son that what to do in his life. We all know balayya's son mokshagna was acting in ballay's 100th film