సారీ చెప్పిన బాలయ్య

Bala Krishna About His Words On Woman

03:28 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Bala Krishna About His Words On Woman

ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన సినీ నటుడు బాలకృష్ణ మరో వివరణ ఇచ్చారు. 'సినిమా ఆడియో పంక్షన్ లో తానన్న మాటలను అక్కడున్న వాళ్లెవరూ తప్పుపట్టలేదు. మహిళలంటే తనకెంతో గౌరవం. సినిమాల్లో తమ పాత్రల స్వభావం గురించే మాట్లాడా. వేదిక పై ఉన్న అందరూ ఆ విషయాన్ని సరదాగా తీసుకున్నారు ఎవరూ తప్పు పట్టలేదు. మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయలేదు' సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ మహిళలు ఇక మందు బాలకృష్ణ సనిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించామని చెప్పుకోవడం జరుగుతుందని, నా ప్రవర్తన గురించి కూడా చెప్పుకుంటారని అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం తండ్రి ఎన్టీఆర్‌ నుంచే వంశపారంపర్యగా వచ్చిందని, ఆ విషయం ఇదివరకే చెప్పానని, మహిళలకు సమాన హక్కులు, ఆస్తిలో సమాన వాటా, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు.. ఇవన్నీ కల్పించింది ఎన్టీఆరేనని, మహిళలకు ఏ సినిమాల్లో లేని ప్రాముఖ్యత తమ చిత్రాల్లో ఉంటుందని బాలయ్య పేర్కొన్నారు. తమ వ్యాఖ్యలపై ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చునని ఆయన అన్నారు.

మన్నించాలి ...

కాగా సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ బాలకృష్ణ మహిళలను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం పై జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారడం, దీనిపై అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం, నేపధ్యంలో , బాలకృష్ణ తరఫున టీడీపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సినిమా వేడుకల్లో తన చలన చిత్రాల్లో కథాపరమైన సన్నివేశాల గురించి చెబుతూ చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని కోరారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా నొచ్చుకుంటే మన్నించాలని కోరుతున్నానంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

English summary

Hindupuram MLA and Hero Nandamuri Balakrishna gives explanation to his sensational comments on Woman in Savithri Movie Audio Function.In Andhra Pradesh Assembly Bala Krishna speaks and says that he says that he and his family members were also give huge respect to woman.