'గౌతమీపుత్ర శాతకర్ణి’ పై బాలయ్య క్లారిటీ

Bala Krishna Announces His 100th Film

11:36 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Bala Krishna Announces His 100th Film

హమ్మయ్య నందమూరి నటసింహం బాలయ్య వందో సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఉగాదిని పురస్కరించుకుని అమరావతిలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి ప్రకటించారు. ‘ఖండ ఖండాలుగా ఉన్న భారతావనిని ఏకం చేసి అఖండభారతావనిగా శోభను చేకూర్చిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ఆ యుద్ధ వీరుడు మన తెలుగువాడు. అశోకుడు వంటి వాళ్ల చరిత్ర చదువుకొంటున్న మనం దురదృష్టవశాత్తు మన ప్రాంతం నుంచి దేశాన్ని పాలించిన శాతకర్ణి గురించి తెలుసుకోవడం లేదు. ఆ తెలుగు వీరుడి గాథని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పేరుతో నా వందో సినిమాగా తెరకెక్కించడం ఆనందంగా ఉంది’’ అని బాలయ్య చెప్పాడు.  క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోంద బోతోన్న ఈ చిత్రాన్ని  బిబో శ్రీనివాస్‌ సమర్పిస్తున్నారు. వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి , మాటలను సాయిమాధవ్‌ బుర్రా రాశారు. 

ఇవి కూడా చదవండి: 

షార్ట్స్ తోకాలేజీకి అమ్మాయిలు

సర్దార్ తోనైనా పవన్ కళ్ళు తెరవాలన్న వర్మ

1/7 Pages

గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి విగ్రహావిష్కరణ ...

Img Src : ABN Andhra Jyothi

అమరావతిలోని ధ్యానబుద్ధ ప్రాజెక్టు సమీపంలోని గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి విగ్రహాన్ని బాలయ్య ఆవిష్కరించారు. దర్శకుడు క్రిష్ , గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు.

English summary

Hindupuram MLA and Cine Hero Nandamuri Balakrishna Announces his 100th movie.Bala Krishna was said that he was going to act in "Gowtami Sathakarni"movie under the direction of Krish.He inagurated the statue of Gautami Sathakarni in Amaravathi.Bala Krishna Announced his 100th film on the eve of Festival "Ugadi"