యాడ్స్ లో నటించడంపై బాలయ్య చెప్పిన షాకింగ్ న్యూస్!

Bala Krishna gives clarity about ads

06:07 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Bala Krishna gives clarity about ads

సినిమా యాక్టర్లు యాడ్స్ లో కూడా నటిస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్రనటులు తప్ప ఇప్పుడు ఇంచుమించు అందరు నటులూ, చిన్నా పెద్దా తేడాలేకుండా యాడ్స్ కుమ్మేస్తున్నారు. నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ.. ఇలా చాలామంది హీరోలు యాడ్స్ లో నటించారు. నటిస్తున్నారు కూడా... చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు యాడ్స్ టచ్ చేసిన వాళ్లే. అయితే నందమూరి బాలయ్య మాత్రం ఇప్పటి వరకు అటువైపు కనిపించలేదు. అందుకు కారణం ఏంటని అడిగితే బాలయ్య చెప్పిన సమాధానం వింటే దిమ్మ తిరిగిపోతుంది.

హీరో ఇమేజ్ ను అడ్డం పెట్టుకుని తన తండ్రి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ ప్రకటనల్లో నటించలేదన్నది బాలకృష్ణ చెప్పే మాట. అయితే కొందరు ఆయనను తమ ఆస్తిగా భావించి ఆయన నటించిన సినిమా ఫోటోల్నే తమ ప్రాడెక్ట్స్ మీద వేసుకునేవారని కూడా బాలయ్య చెబుతున్నాడు. ప్రేక్షకుల వల్ల మనకు ఇమేజ్ వచ్చిందని, వారి అభిమానాన్ని కాపాడుకోవాలంటే వారు మెచ్చే సినిమాలతోనే ఆనందాన్ని కలిగించాలి తప్ప ఆ ఇమేజ్ ను మన స్వార్థం కోసం సొమ్ము చేసుకోకూడదని ఎన్టీఆర్ అనేవారట.

తండ్రి ఎన్టీఆర్ చెప్పిన ఆ మాటను తాను నమ్మడం వల్లే యాడ్స్ లో నటించలేదని బాలకృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి తాతయ్య కోసం అంతగా చెప్పే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో తాతను ఎందుకు ఫాలో అవ్వడం లేదబ్బా?

English summary

Bala Krishna gives clarity about ads