ఈ చంటిగాడికి పెళ్లి కళ వచ్చేసింది

Baladitya marriage was fixed

11:17 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Baladitya marriage was fixed

అవును జబర్ధస్త్ చంటికి తాజాగా పెళ్లి అయిపోగా, మరో చంటిగాడు అదేనండీ హీరో బాలాదిత్యకి కూడా పెళ్లి చేసేస్తున్నారట. ఆ మధ్యన 1940లో ఒక గ్రామం సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినా కూడా.. ఎందుకో ఆ క్రేజ్ ను అస్సలు క్యాష్ చేసుకోలేకపోయాడు. లిటిల్ సోల్జర్స్, హిట్లర్ వంటి సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్టు.. చంటిగాడు సినిమాతో హీరోగా పరిచయ్యాడు. అదీ మనోడి ప్రస్థానం. అప్పటినుండి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి పాట్లు పడుతూనే ఉన్నా, వర్కవుట్ కాలేదు. అయితే, పెళ్ళి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం అని తెలుసుకుని.. సినిమాల్లో సక్సెస్ ఎలా ఉన్నప్పటికీ లైఫ్ లోని ఈ తంతును హ్యాపీగా ముగించడానికి బాలాదిత్య సిద్ధపడ్డాడట.

మరి పెళ్ళి తరువాత మనోడి కెరియర్ కూడా బాగా టర్న్ అవుతుందని సన్నిహితులు ఆశిస్తున్నారు. సినిమాల్లో పూర్తిగా ఖాళీ అయిపోవడంతో, యాంకరింగ్ వైపు పరుగులు తీసిన ఈ చంటోడు, అక్కడ బాగానే సెట్టయ్యాడని చెప్పాలి. ఇప్పుడు ఈటివిలో ఓ క్విజ్ షో యాంకరింగ్ తో అదరగొట్టేస్తున్నాడు. మొత్తానికి ఈ సక్సెస్ ఇచ్చిన కిక్కుతో బాలాదిత్య చక్కగా ఒక ఇంటోడు అయిపోతున్నాడు. ఈ ఆగష్టు 6న మానస అనే అమ్మాయిని పెళ్ళిచేసుకోబోతున్నాడు. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తాజ్ మహల్ హోటల్ లో మనోడు 12వ తేదీన ఫిలిం ఇండస్ట్రీకి రిసెప్షన్ ఇవ్వనున్నాడు.

English summary

Baladitya marriage was fixed