బాలయ్య సినిమాకు జగన్ అనుచరుని కధ!

Balakrishna 101 movie story was confirmed

03:55 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Balakrishna 101 movie story was confirmed

సినిమా సినిమా యే మిగిలిన విషయాలు మిగిలినవే... అలా అనుకోకపోతే మంచి చిత్రాలు వచ్చే అవకాశం ఉండదు. రాజకీయాలు పక్కన పెట్టి సినిమాలు చేయాలి మరి. సినిమాకి కుల, మత, ప్రాంత భేదాలుండవన్నట్టే రాజకీయం కూడా వర్తించదన్నమాట. అది టాలీవుడ్ కి బానే అలవాటుంది. లేకుంటే ఇప్పుడు నందమూరి నటసింహం బాలయ్య సినిమా ఒకే అయ్యేది కాదు కదా. ఇంతకీ విషయం ఏమంటే, ప్రస్తుతం వందో సినిమా కోసం గౌతమీపుత్ర శాతకర్ణిగా ముస్తాబవుతోన్న బాలకృష్ణ ఇదే జోరులో 101, 102 సినిమాలకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. 101వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా రానున్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బాలయ్య సైతం రైతు సినిమా విషయాన్ని ధృవీకరించారు.

రైతుల కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడో కొత్త న్యూస్ వెలుగులోకొచ్చింది. జగన్ అనుచరుడిగా చెప్పుకునే సాక్షి ఫీచర్స్ ఎడిటర్ ప్రియదర్శిని రామ్ రైతు చిత్రానికి కథ అందిస్తున్నారట. ఆ కథనే కృష్ణవంశీ తనదైన కథనంతో తెరకెక్కించబోతున్నాడట. బాలయ్య స్వయంగా ప్రకటించారంటే సినిమా సెట్స్ పైకి చేరినట్టేనని చెప్పేయచ్చు. నిజానికి ఇదే బాలయ్య వందో సినిమా కావాల్సింది. అంతలోనే క్రిష్ తెలుగు చక్రవర్తి అయిన శాతకర్ణి కథ తీసుకురావడంతో బాలయ్య అటువైపు మొగ్గు చూపినట్లు టాక్. ప్రియదర్శిని రామ్ కి సినిమాలు కొత్తేం కాదు. గతంలో సినిమా విభాగానికి ఎడిటర్ గా ఉన్న ఈయన ఆ మధ్య విడుదలైన జ్యోతిలక్ష్మి, బెంగాల్ టైగర్ సినిమాల కోసం మేకప్ వేసుకున్నారు.

సినిమాలపై మక్కువతో మనోడు(2006) చిత్రంలో నటిస్తూ దర్శకత్వం వహించిన ఈయన ఉపేంద్ర, ప్రియమణి, కామ్న జఠ్మలాని నటీనటులుగా 2007లో టాస్ సినిమాని కూడా రూపొదించారు. అటుపై మెగాఫోన్ కి దూరంగా ఉన్న రామ్ బాలయ్య 101 చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. రాజకీయ పరంగా ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉండే వ్యక్తులు ఓ సినిమా కోసం కలుస్తుండటం కొత్త కాకపోయినా ఇది మాత్రం సంచలనమే అని చెప్పుకుంటున్నారు.

English summary

Balakrishna 101 movie story was confirmed