101వ సినిమాలో 'రైతు'గా బాలయ్య

Balakrishna 101 movie title Raithu

06:47 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Balakrishna 101 movie title Raithu

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక వందో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో గౌతమిపుత్ర శాతకర్ణిగా నటిస్తున్న బాలయ్య.. తాను తర్వాత నటించబోయే 101వ సినిమాను కూడా ప్రకటించేశారు. హిందూపురం ఎమ్మెల్కేగా కొనసాగుతున్న బాలకృష్ణ అక్కడి రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా ఈ ప్రకటన చేశారు. తన 101వ సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో ఉంటుందంటూ.. ఆ సినిమా పేరు రైతు అని తెలిపారు. గత కొంతకాలంగా ఇదే వార్త మీడియాలో వస్తున్నప్పటికీ మంగళవారం బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న గౌతమిపుత్రశాతకర్ణి చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. చిత్ర దర్శకుడు క్రిష్ కు పెళ్లి నిశ్చయమైన నేపథ్యంలో ఇటీవల కొంత విరామం తీసుకున్నారు చిత్ర యూనిట్. వచ్చే ఏడాది సంక్రాంతికి గౌతమిపుత్రగా తెరకెక్కనున్న బాలయ్య తదుపరి రైతుగా కనిపించనున్నారనే వార్త నందమూరి అభిమానులకు సంతోషాన్నిస్తుంది. మొత్తం మీద బాలయ్య వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు.

English summary

Balakrishna 101 movie title Raithu