వారంలోనే బాలయ్య వందో సినిమా ప్రారంభం 

BalaKrishna About His 100th Film

10:30 AM ON 21st January, 2016 By Mirchi Vilas

BalaKrishna About His 100th Film

ఈ సంక్రాంతి కి విడుదలైన బాలయ్య 99వ చిత్రం గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'డిక్టేటర్' ఘనవిజయం అందుకుంది. దీంతో 100వ సినిమా ఓ వారం రోజుల్లోనే మొదలు పెట్టేయాలని బాలయ్య చూస్తున్నాడు. ఇందుకోసం అప్పుడే కసరత్తు మొదలైంది. ఇప్పటికే 100వ చిత్రంలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తేలిపోవడంతో , భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వారం రోజుల్లోనే వందవ చిత్రం మొదలవుతుందని స్వయంగా బాలయ్య ప్రకటించాడు. డిక్టేటర్ హిట్ తో బాలయ్య యమ ఖుషీ గా వున్నాడేమో, ఇకనుంచి ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెబుతున్నాడు. ఓ టివి చానెల్ ఇంటర్యూ లో మజాగా కబుర్లు చెప్పాడు.

నో రిటైర్ మెంట్ .....

'నటనకు రిటైర్ మెంట్ ఏమిటి? నా వరకూ అయితే అలాంటేదేమీ లేదు. నా మనవడు నటించే వరకూ నాకు నటించాలని వుంటుంది' అని బాలయ్య చెప్పాడు. మనకు తెల్సింది పదిమందికీ చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం. మనతోనే మరుగున పడిపోకూడదు అని అంటున్నాడు.. నాన్నగారి పాత సినిమాలు చేయాలని ఉంటుందని అయితే సోషల్ చిత్రాలు కాకుండా , పౌరాణికం ,జానపదం వంటి సినిమాలు అయితే బాగుంటుందని వివరిస్తూ , అలాంటి వాటిపై దృష్టి పెడతానన్నాడు. నర్తనశాల సినిమా చేయాలనీ వుందని అయితే అందులో శ్రీకృష్ణుడు , అర్జునుడు , కీచకుడు , బృహన్నల పాత్రలు నేనే వేయాలని వుందని వివరించాడు. కానీ ఇలాంటి భారీ సినిమాలు చేసేటప్పుడు చాల జాగ్రత్తలు అవసరమని పేర్కొన్నాడు.

English summary

Balakrsihna who was enjoying the success of his 99th movie Dictator he says to an Tv interview that he is going to start his 100th film within one week .