మిమ్మల్ని డైరెక్ట్ చెయ్యాలంటే నాదొక షరతు

BalaKrishna agreed for director Krish conditions

03:41 PM ON 4th April, 2016 By Mirchi Vilas

BalaKrishna agreed for director Krish conditions

అవునా, డిక్టేటర్ బాలయ్యను లీడ్ చేయడమా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇది బాలకృష్ణ 100వ సినిమా గురించి కొత్త న్యూస్.... స్టోరీ, నటీనటులు ఇలా చాలానే గాసిప్స్ వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ సినిమా ను వారాహి చలనచిత్రం-14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జాయింట్‌గా నిర్మిస్తారని వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయా నిర్మాతలు డ్రాపైనట్లు తాజా వార్త.. ఇందుకు కారణాలు లేకపోలేదు. బాలయ్యతో ఈ మూవీ చేయాలంటే కొన్ని షరతులు పెట్టాడట డైరెక్టర్ క్రిష్. ఈ మూవీకి తన ఫ్రెండ్ రాజీవ్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తాడని, అందుకు ఓకే అయితే సిద్ధమని అన్నాడట. ఈ విషయంలో బాలయ్య నుంచి సానుకూల సంకేతాలు రావడంతో గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక రేపో మాపో ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటేల్స్ అధికారికంగా వెల్లడికానున్నాయి. రాజీవ్‌రెడ్డి ఎవరోకాదు.. క్రిష్‌కు క్లోజ్‌ఫ్రెండ్. కృష్ణమ్ వందే జగద్గురుమ్, కంచె సినిమాలకు ఆయనే ప్రొడ్యూసర్. ఈ క్రమంలోనే బాలయ్య ‘యోధుడు’ చిత్రానికి కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మరో వైపు బోయపాటి డైరెక్షన్‌లో సాయి కొర్రపాటి-అనిల్ సుంకరలు సంయుక్తంగా బాలయ్యతో 101 మూవీని చేసే ఛాన్స్ ఉందని మరో టాక్.

English summary

BalaKrishna agreed for director Krish conditions. BalaKrishna 100th film director Krish putted some conditions to Balakrishna to direct Balayya.