డైరెక్టర్‌ గా బాలయ్య!!

Balakrishna as a director

12:36 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Balakrishna as a director

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డిక్టేటర్‌'. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి మంచి స్పందనే లభించింది. ఇదిలా ఉండగా బాలయ్యకి భవిష్యత్తులో ఒక సినిమా అయినా స్వీయ దర్శకత్వంలో తీయాలనే కల ఉంది. అయితే తన దర్శకత్వంలో వచ్చే సినిమా సాధారణంగా అందరూ తీసే సినిమాలా ఉండదని బాలయ్య అంటున్నాడు. తన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయనీ, విభిన్నంగా ఉండే సినిమాకి దర్శకత్వం వహిస్తానని తెలియజేసాడు. అందుకే తన కల నెరవేర్చుకోవడం కోసం దాదాపు దశాబ్ధంనర క్రితం తన తండ్రి నటించిన 'నర్తనశాల' సినిమాను తన స్వంత దర్శకత్వంలో రీమేక్‌ చేయాలని అనుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

ఈ సినిమాకి ప్రారంభోత్సవం కూడా జరిగింది కానీ హీరోయిన్‌ సౌందర్య మరణించడంతో ఈ సినిమా ఆగిపోయింది. సౌందర్యను భర్తీ చేసే హీరోయిన్‌ దొరక్కపోవడంతో ఈ సినిమా మళ్ళీ ప్రారంభించలేదు. డైరెక్షన్‌ చేయాలనుకున్న తన కల పూర్తిగా నెరవేరకపోయినప్పటికీ బాలయ్య 'పెద్దన్నయ్య' సినిమా క్లైమ్యాక్స్ ను డైరెక్ట్‌ చేశాడంట. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. క్లైమ్యాక్స్ వల్లే ఆ సినిమా హిట్టయ్యిందట. పౌరాణికాలు లేదా జానపదాలు తరహా సినిమా తియ్యాలని బాలయ్య కోరిక. కానీ అది నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

English summary

Balakrishna wants to direct a movie. In past he directed his 'Peddannayya' movie climax. But no body don't know this. But 15 years back he wants to direct 'Narthanasala' movie remake.