వందో సినిమా లో పోలీస్ గెటప్పా??

Balakrishna as a police in his 100 film

12:02 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Balakrishna as a police in his 100 film

నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాకి సన్నాహాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బహుశా ఈ సినిమాలో బాలయ్య పోలీసు పాత్రలో కనిపిస్తాడేమో. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. 'పటాస్' ఫేమ్ అనిల్‌ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. బాలయ్యకు అనిల్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. పైగా ఇందులో పోలీసు పాత్ర మరింత నచ్చిందట. ఇందులో బాలయ్య ఇంతకు ముందెప్పుడూ కనిపించని విధంగా చురుకైన పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. గతంలో రావిపూడి ఈ విషయం పై బాలయ్యను సంప్రదించాడు. కానీ బాలయ్య వేరే సినిమాలలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా పై దృష్టి పెట్టలేదు.

అయితే ఈ సినిమా బాలకృష్ణ 100వ సినిమాగా వస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి సాయిధరమ్తేజ్ తో 'సుప్రీమ్‌' సినిమా చేస్తున్నాడు.

English summary

Nandamuri Balakrishna as a police in his 100 film. But it is not yet confirmed. Pataas fame Anil Ravipudi told story to Balakrishna. Balayya impressed and to do with his film.