గోనగన్నారెడ్డిగా బాలయ్య

Balakrishna as Gona Ganna reddy

12:45 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Balakrishna as Gona Ganna reddy

'రుద్రమదేవి' లో గోన గన్నారెడ్డి గా అల్లు అర్జున్ ఏ విధంగా మెప్పించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రుద్రమదేవి హిట్ అవ్వడానికి కారణం అల్లు అర్జున్ చేసిన పాత్రే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరో సారి గోన గన్నారెడ్డి గా నందమూరి నటసింహం బాలకృష్ణ కనిపించబోతున్నారు. విషయంలోకి వస్తే బాలకృష్ణ నటించబోయే 100వ చిత్రం 'ఆదిత్య 999' అని తెలిసిందే. బాలకృష్ణతో 'ఆదిత్య 369' తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు గారే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. 'ఆదిత్య 369' లో టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలానికి బాలకృష్ణ వెళ్తాడు. ఇప్పుడు 'ఆదిత్య 999' లో బాలకృష్ణ కాకతీయ రాజులకాలం నాటికి వెళ్తాడని, అక్కడ గోన గన్నారెడ్డి గా బాలయ్య కనిపించి ప్రజలను కాపాడటమే ఈ కథలోని ముఖ్య ఉద్ధేశమట.

ఇటువంటి పాత్రలు చెయ్యడంలో బాలకృష్ణ దిట్ట. ఇంక గోన గన్నారెడ్డి గా ఏ విధంగా అలరిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సింగీతం శ్రీనివాసరావు గారు ఇటువంటి చిత్రాలు ఒక రేంజ్‌లో తెరకెక్కిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

English summary

Nandamuri Balakrishna is acting as a Gona Ganna reddy in Aditya 999. This movie is directing by Singeetam Srinivasa Rao.