తన తండ్రి రామారావు గారిలా బాలయ్య!!

Balakrishna as RamaRao

01:11 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Balakrishna as RamaRao

బాలయ్య 99వ సినిమా 'డిక్టేటర్‌' విజయంతో మంచి జోష్‌ తో ఉన్నాడు. అయితే బాలయ్య 100వ సినిమాగా ఆదిత్య 369 సీక్వెల్‌ ఆదిత్య 999 వస్తుందా, లేదంటే బాలయ్యకు సింహా, లెజెండ్‌ లాంటి హిట్‌ సినిమాలు ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో వస్తుందా అనే చర్చలు కొనసాగుతున్నాయి. ఏ సినిమా ముందుగా చేస్తే ఆ సినిమా బాలయ్య 100వ సినిమా అవుతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా సినిమా చెయ్యాలని బాలయ్య నిర్ణయించుకున్నాడట. అయితే బాలయ్య బోయపాటి తో చేయబోయే సినిమా టైటిల్‌ తెగ హల్‌చల్‌ చేస్తుంది. ఈ సినిమాకి 'రామారావు గారు' అనే టైటిల్‌ బోయపాటి అనుకున్నాడట.

బాలయ్య 100వ సినిమా కాబట్టి ఆయన తండ్రి పేరుతో టైటిల్‌ ఉంటే మంచిదని బోయపాటి ఉద్ధేశం. దీనికి బాలయ్య కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

English summary

Nandamuri BalaKrishna-Boyapati Srinu combo was again set a viral with great title. Actually Balakrishna want to act in Aditya 999 and also want to act in Boyapati Srinu direction. For this combo they set a title called RamaRao Garu.