గుర్రంపై బాలయ్య ....

Balakrishna Busy In Horse Riding Training

09:39 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Balakrishna Busy In Horse Riding Training

పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, నందమూరి బాలయ్య కూడా గుర్రం ఎక్కాడు. అదేమిటి అనుకుంటున్నారా? ఈ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఆ సినిమాలో పవన్ చెక్క గుర్రం ఎక్కిన సీను ట్రైలర్ లో కనిపించడం, ఈ గుర్రం కధ గురించి ఆలీ చెప్పడం తెల్సిందే. కానీ బాలయ్య అలా కాదు. నిజంగానే గుర్రం ఎక్కి స్వారీ చేయడమే కాదు. గుర్రంపై వుండి యుద్ధం కూడా చేయబుతున్నాడు. ఇంతకీ విషయం ఏమంటే, గుర్రపు స్వారీ చేయడం బాలకృష్ణకి కొత్తేమీ కాదు. సినిమాకి అవసరమైన ప్రతిసారీ ఆయన గుర్రమెక్కాడు. ‘భైరవద్వీపం’లో అయితే గుర్రంపై ఎక్కువగా కని పించడం తెల్సిందే. కానీ ఇప్పుడు అలా కాదు, ఈసారి స్వారీ చేయడమే కాదు, గుర్రంపై నుంచి యుద్ధం కూడా చేయాల్సి వుంటుందట. అందుకే ప్రత్యేకంగా తర్ఫీదు తీసుకుంటున్నట్టు తెలిసింది. త్వరలోనే బాలకృష్ణ వందో చిత్రం మొదలుకాబోతోందని తెల్సిందే. క్రిష్‌ దర్శకత్వంలో రానున్న ఆ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందనున్న ఆ సినిమాకి ‘యోధుడు’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఇందులో బాలకృష్ణ గుర్రపుస్వారీ చేయాల్సి వుంటుందట. యుద్ధ సన్నివేశాలు కూడా భారీగా ఉంటాయట. అందుకే ప్రత్యేకంగా నిపుణుల సమక్షంలో తర్ఫీదు తీసుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి, కొన్ని కీలక పనులు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలవడనుంది. మొత్తానికి బాలయ్య నిజం గుర్రం మీద విన్యాసాలు చేయడం కోసం కసరత్తు స్టార్ట్ చేసాడన్న మాట.

కొబ్బరి నీరులో ఉన్న ప్రయోజనాలు

ఇండియా టీమ్ కు పూనమ్‌ హాట్‌ గిఫ్ట్‌

రత్నాచల్ కి టెండర్

ఇండియా అభిమానులకు విరాట్ భలే బుద్ధి చెప్పాడు

బిగ్ షాట్ వెంట వెళ్తున్న సూపర్ స్టార్ ....

English summary

Nandamuri Balakrishna was planning and getting ready for his 100th movie.A news came to know Bala Krishna was acting in Yodhudu movie under the direction of Krish.Now Balakrishna was taking training on Horse riding for his movie.