డూప్‌ లేకుండా బాలకృష్ణ సాహసం!

Balakrishna doing risk shot without dupe

10:40 AM ON 19th December, 2015 By Mirchi Vilas

Balakrishna doing risk shot without dupe

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం 'డిక్టేటర్‌'. 'లౌక్యం' ఫేమ్‌ శ్రీవాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు. అంజలి, సోనాల్‌చౌహాన్‌, అక్ష బాలకృష్ణ సరసన నటిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలంటే మాస్‌ డైలాగ్స్‌తో పాటు భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉండడం సహజం. అయితే ఈ చిత్రంలో ఓ భారీ యాక్షన్‌ సన్నివేశం కోసం బాలకృష్ణ డూప్‌ లేకుండా చేస్తున్నాడట. ఈ యాక్షన్‌ సన్నివేశం డిక్టేటర్‌ చిత్రానికే హైలేట్‌గా నిలుస్తుందట. హైదరాబాద్‌ యూసఫ్‌గూడలో యాక్షన్ కొరియోగ్రాఫర్‌ రవివర్మ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ సన్నివేశంలో 150 మంది ఫైటర్స్‌ పాల్గొంటున్నారట.

చివరి దశకు చేరుకున్న ఈ యాక్షన్‌ సన్నివేశం కోసం బాలయ్య ఎటువంటి డూప్‌ లేకుండా చేస్తున్నారట. 55 సంవత్సరాల వయస్సులో కూడా బాలకృష్ణ ఇంత రిస్క్‌ చెయ్యడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. డిక్టేటర్‌ మేకర్స్‌ బాలకృష్ణని డూప్‌ తో చేయిస్తాం అని అడిగినా నేనే చేస్తానని బాలకృష్ణ చేప్పారట. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలు డిసెంబర్‌ 20న నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అయిన అమరావతిలో అంగరంగ వైభవంగా విడుదల చేయబోతున్నారు.

English summary

Balakrishna doing risk shot without dupe in Dictator movie.