సాహసం చేస్తున్న గౌతమిపుత్ర

Balakrishna doing without doop in war sequences

11:11 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Balakrishna doing without doop in war sequences

నందమూరి నటసింహం బాలయ్య 100వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతికి అలరించడానికి సిద్ధం అవుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో శ్రేయ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం క్రిష్ సహా చిత్ర యూనిట్ జార్జియాలో ఉంది. ఈ నెల 4 నుండి జార్జియాలోని రష్యాకు దగ్గరగా ఉండే మౌంట్ కజ్ బెగ్ వద్ద యుద్ధ నేపథ్యంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నెలాఖరు వరకు జరుగనున్న ఈ షెడ్యూల్ లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే పోరాట సన్నివేశాలను షూట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు.

అయితే సాధారణంగా ఇలాంటి సన్నివేశాలలో డూప్ ల సాయం తీసుకుంటారు. అయితే బాలయ్య తానే స్వయంగా ఈ సన్నివేశాలలో నటిస్తున్నాడని టాక్. యువ హీరోలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా బాలయ్య లాంటి సీనియర్ హీరో తన వయసుని, రిస్క్ ని అని భావించక ఈ ఫీట్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు క్రిష్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. గతంలో 'లయన్' సినిమాకి ఈ సాహసాన్నే చేసిన బాలయ్య అప్పట్లో గాయాల పాలయ్యాడు. అందుకే హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

English summary

Balakrishna doing without doop in war sequences