సిఎం పదవి పై ఆసక్తి లేదు: బాలయ్య!!

BalaKrishna don't have any interest on CM position

12:05 PM ON 25th January, 2016 By Mirchi Vilas

BalaKrishna don't have any interest on CM position

బాలయ్య ను చూస్తే చాలు సిఎం, సిఎం అని నినాదాలు చేస్తుంటారు బాలయ్య అభిమానులు. బాలయ్య ఎమ్మేల్యేగా ఎన్నికైన తర్వాత అభిమానుల్లో మరిన్ని ఆశలు పెరిగాయి. అయితే ఒక ఇంటర్‌వ్యూ లో బాలయ్య రాజకీయ జీవితం గురించి ప్రస్థావించగా ఆయనకు పదవుల పై అంత ఆసక్తి లేదనీ, రాజకీయ రంగంలో ఆయనకు లక్ష్యాలేమి లేవనీ చెప్పేశాడు. తను విధిని నమ్ముతానని, తనను విధి ఏవిధంగా నడిపిస్తే ఆ విధంగా నడుచుకుంటానని బాలయ్య అన్నాడు. అభిమానులకు కోరికలు ఉంటాయి. అయితే నన్ను రాజకీయాల్లోకి రావొద్దని చెప్పిన అభిమానులు కూడా ఉన్నారు.

నా మనస్తత్వానికి రాజకీయరంగం సరిపడదని చెప్పారు. కానీ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం తో రాజకీయంలోకి వచ్చాను. నాకు రాజకీయంగా ఒక్కటే ముఖ్యం కాదు సినిమాలు కూడా ముఖ్యమే. అది మాత్రమే కాదు 'బసవ తారకమ్మ' క్యాన్సర్‌ హాస్పటల్‌ పై భాద్యతలు ఉన్నాయి. ఎవరైనా నన్ను మీరు ఎవరని అడిగితే కేవలం ఎమ్మెల్యే అని మాత్రమే చెప్పను. ముందుగా సినీనటుడిని, ఎమ్మెల్యేని, బసవ తారకమ్మ క్యాన్సర్‌ హాస్పటల్‌ కి చైెర్మన్‌ ని అని చెప్పాడు. ఈ మూడూ నాకు ముఖ్యమే అని చెప్పాడు బాలయ్య. పదవుల పై అంత ఆసక్తి లేదని చెప్తూ, సిఎం పదవి పై తనకి ఆసక్తి లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు బాలయ్య.

English summary

BalaKrishna don't have any interest on CM position. He gave a latest interview.