వాటి పై పోరాటం చేస్తానన్న బాలయ్య!!

BalaKrishna fights on that issue

12:42 PM ON 28th January, 2016 By Mirchi Vilas

BalaKrishna fights on that issue

నటసింహం నందమూరి బాలకృష్ణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'బసవతారకం' క్యాన్సర్‌ హాస్పటల్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా బాలయ్య ప్రసంగిస్తూ మహిళల పై లైంగిక వేదింపులను అరికట్టే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బాలయ్య లెజెండ్‌, డిక్టేటర్‌ సినిమాలలో ఉన్న సంఘటనలు కూడా ప్రస్తావించారు. స్త్రీలను అందరూ గౌరవించాలి అని చెప్పారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కూడా క్యాన్సర్‌ హాస్పటల్‌ ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడని ఈ సందర్బంగా స్పష్టం చేశాడు. బాలకృష్ణ తాజా సినిమా 'డిక్టేటర్‌' కి ప్రేక్షకులలో మిశ్రమస్పందన లభించింది.

శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో అంజలి, సోనాల్ చౌహాన్‌, మరియు అక్ష ప్రధాన పాత్రలు పోషించారు. మరోవైపు బాలకృష్ణ 100వ సినిమా 'ఆదిత్య 999' త్వరలోనే ప్రారంభం కానుంది.

English summary

Due to Republic Day Balakrishna hoisted flag at BasavaTarakam Cancer hospital. After the flag hoisting BalaKrishna talks about we have to fight about sexual harrassment on ladies.