తల్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

Balakrishna gave a super gift to Hema Malini

12:27 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Balakrishna gave a super gift to Hema Malini

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించగా, ఇప్పుడు రాజకోటలకు సంబంధించిన సీన్స్ ని దర్శకుడు క్రిష్ పిక్చరైజ్ చేస్తున్నాడు. గత షెడ్యూల్స్ వరకూ బాలయ్య సింగిల్ హ్యాండ్ తో షూటింగ్ నడిపించేయగా.. తాజా షెడ్యూల్ లో శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో నటిస్తున్న హేమమాలిని.. భార్య రోల్ లో చేస్తున్న శ్రియ కూడా జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్ తో కలిసి పాండవ వనవాసం.. శ్రీకృష్ణ విజయం చిత్రాల్లో హేమమాలిని నటించింది. ఆ రెండు పౌరాణికాలు కాగా.. ఇప్పుడు మళ్లీ రాజుల కాలానికి సంబంధించిన చిత్రంలో ఈమె తిరిగి తెలుగులో నటిస్తుండడం ఓ విశేషం.

బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని తొలి రోజు షూటింగ్ కి రాగానే.. నందమూరి హీరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడట. తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనే నేసిన లేపాక్షి చీరను హేమమాలినికి ప్రెజెంట్ చేశారట బాలయ్య. ఈ నందమూరి హీరో తనకు ఇచ్చిన ప్రాధాన్యత విలువ చూసి.. ఆ బాలీవుడ్ నటి చాలా సంతోషించారట కూడా. అంతే కాదు.. గతంలో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి తాను రెండు సినిమాలు చేసినప్పటి సంగతులను కూడా హేమమాలిని పంచుకున్నట్లు చెబుతున్నారు. కాగా గౌతమీ పుత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని కోటల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కుతుండగా, 2017 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అసెంబ్లీ దగ్గరే మహిళా ఎస్సై ఆత్మహత్యాయత్నం

ఇది కూడా చదవండి: భార్యపై ట్వీట్ తో చమత్కారం విసిరిన సెహ్వాగ్

ఇది కూడా చదవండి: మీ దగ్గర ఈ కెమికల్స్ ఉంటే మీ పాత ఫోన్ నుంచి బంగారం తియ్యొచ్చు!

English summary

Balakrishna gave a super gift to Hema Malini. Balakrishna gave a lepakshi saree to his mother Hema Malini.