చిరంజీవిని నెత్తినెక్కించుకోనన్న బాలయ్య

Balakrishna Invites Chandrababu Naidu for Lepakshi Utsavalu

09:42 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Balakrishna Invites Chandrababu Naidu for Lepakshi Utsavalu

ఒకరు మెగాస్టార్ , మరొకరు యువరత్న ... ఒకప్పుడు ఇద్దరి సినిమాలు రిలీజైతే యమ సందడే , పైగా పోటీ ఎక్కువ వుండేది. రాజకీయాల్లో కూడా భిన్న దృవాలే. చిరంజీవి రాజకీయ పార్టీ ప్రజారాజ్యం పెట్టి , ప్రతిపక్ష స్థానానికి పరిమితమై, కాంగ్రెస్ లో విలీనం చేసేసాడు. ఇక నందమూరి బాలయ్య తండ్రి ఎన్టిఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలోనే చేరి , హిందూపురం నుంచి పోటీచేసి ఎంఎల్ఎ అయ్యాడు. ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఉత్సవాలకు సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వానించడానికి విజయవాడకు వెళ్లిన బాలయ్య, చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు. చంద్రబాబును ఆహ్వానించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బాలయ్యను చిరంజీవికి ఆహ్వానం పంపారా అని అడిగితే, లేదని చెప్పాడు. అంతేకాదు, సినీ పరిశ్రమలో ఎవరిని పిలవాలో వారినే పిలిచానని, ఎవరిని పిలవాలో తనకు తెలుసని బాలయ్య అన్నాడు. 'నా పక్కన గ్లామర్ ఉన్నవారే ఉన్నారు. వారితోనే కలిసి ప్రయాణిస్తా. ఎవరినీ నెత్తిన ఎక్కించుకోను. డిక్టేటర్ పద్దతిలోనే వెళ్తా' అంటూ బాలయ్య సినీ స్టైల్లో సరదాగా అనడంతో అక్కడ నవ్వులు పూసాయి. ఇక వైసీపీ ఎంఎల్ఏలు టిడిపిలో చేరడంపై బాలయ్య స్పందిస్తూ, వైసిపిలో తీవ్రమైన అసంతృప్తి ఉందని, అందుకే అలాంటి వారంతా అభివృద్ధిని కోరే టీడీపీలో చేరుతున్నారని బాలయ్య వ్యాఖ్యానించాడు. వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరికపై మీ హస్తం ఉందా అని బాలయ్యను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అదండీ సంగతి .

English summary