షాకింగ్ న్యూస్: 'జనతా గ్యారేజ్' లో బాలయ్య 

Balakrishna is coming to Janatha Garage sets

11:08 AM ON 29th March, 2016 By Mirchi Vilas

Balakrishna is coming to Janatha Garage sets

అవునా, అంటే కొంత తటపటాయించడం ఉంటుంది కానీ అబద్ధం మాత్రం కాదనే చెప్పాలి. ఎన్టీఆర్ కి బాలయ్యకు అంతగా సఖ్యత లేదని అంటారు కదా, ఇదెలా సాధ్యమని అనుకోవచ్చు... కొన్నిసార్లు అసాధ్యాలే సుసాధ్యాలు అవుతాయి. ఇందులో డౌట్ లేదుగా... మరి అసలు విషయానికి వద్దాం... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ హైదరాబాద్ సారధి స్టూడియో సెట్స్ మీద తీయబోతున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి తీయబోయే ఈ సినిమాలో మళయాళ నటుడు మోహన్ లాల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. గతంలో బాలయ్య నటించిన 'గాండీవం' చిత్రంలో మోహన్ లాల్ నటించాడు.

ఇది కూడా చదవండి: నగ్నంగా నటించడానికి నేను రెడీ..

ఆ పరిచయంతో మోహన్ లాల్ ని విష్ చేయడానికి, అలాగే 'జనతా గ్యారేజ్' విషయాలు తెలుసుకోవడానికి బాలయ్య ఆ సెట్స్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. ఈ మధ్యే మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ 'సర్దార్' ఆడియో వేడుకలో ఒకే వేదికపై కనిపించి అన్నదమ్ముల అనుబంధం చాటిచెప్పిన సంగతి తెల్సిందే. ఇక ఇప్పుడు బాబాయ్-అబ్బాయ్ ఒకే సెట్ లో కలుసుకుని నందమూరి అభిమానులకు సంతోషం కలిగించబోతున్నారా?

ఇది కూడా చదవండి: పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

English summary

Balakrishna is coming to Janatha Garage sets. Nandamuri Balakrishna is coming to Janatha Garage sets to see Mohan Lal and Ntr.