చిరు కన్నా బాలయ్యే ముందు!!

Balakrishna is ready for his 100th film

05:09 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Balakrishna is ready for his 100th film

మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ చిత్రాన్ని ప్రకటించడానికి ఏమీ నిర్ణయించుకోలేదు. కానీ నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రం కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. ఇద్దరు ప్రముఖ హీరోలు తమ భారీ చిత్రాలను కొద్ది నెలల్లో ప్రారంభించనున్నారు. కానీ ఈ మధ్యనే 99వ సినిమా 'డిక్టేటర్‌' ను రిలీజ్‌ చేసిన బాలకృష్ణ 100వ సినిమాను, చిరంజీవి 150వ సినిమాకంటే ముందే ప్రారంభించేలా ఉన్నాడు. ఇటీవల జరిగిన మీడియా సమావేశాల్లో బాలయ్య తన 100వ సినిమాకి బోయపాటి దర్శకుడు అని ఖరారు చేశాడు. అయితే ఈ సినిమా పేరు 'ఆదిత్య 999' 1990 లో వచ్చిన 'ఆదిత్య 369' కి సీక్వెల్‌ అని బాలయ్య చెప్పాడు.

బోయపాటి శ్రీను తన వేరే సినిమాలలో బిజీగా ఉండటంతో బాలయ్య బోయపాటి కోసం ఎదురుచూడకుండా 'ఆదిత్య 369' కి దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు నే దర్శకుడిగా ఎంచుకున్నాడు. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి కత్తి రీమేక్‌ చేయనున్నాడు. ఈ సినిమాకి వి.వి. వినాయక్‌ దర్శకుడు.

English summary

Balakrishna is ready to do Aditya 369 sequeal with the name Aditya 999. This movie is directing by Singeetam Srinivasa Rao. This is Balakrishna's 100th film.