మోక్షజ్ఞ లాంచ్‌కు జాతకమే కీలకం

Balakrishna launching his son Mokshagna by seeing Horoscope

11:14 AM ON 10th March, 2016 By Mirchi Vilas

Balakrishna launching his son Mokshagna by seeing Horoscope

జాతకాలు-ముహూర్తాలు-సెంటిమెంట్లు నమ్మే జనాలు చాలామంది ఉంటారు. ఇక సినీ పరిశ్రమలో అయితే చెప్పక్కర్లేదు. అన్నీ ముహూర్త బలాలు చూసుకున్నాకే రంగంలో దిగుతారు. అందులో నందమూరి బాలకృష్ణ అయితే మరీను. తండ్రి ఎన్టీఆర్ మాదిరిగా బాలయ్యకు కూడా దైవభక్తితో పాటూ జ్యోతిషం-జాతకం లాంటి అంశాల మీద నమ్మకం ఎక్కువే. బాలయ్య ముహూర్తాలు చూసుకోకుండా ఇంటి నుంచి కాలు కూడా అడుగుపెట్టడని సన్నిహితుల వాదన. తన సినిమాలన్నింటి విషయంలోనూ ఇదే అనుసరించే బాలయ్య ఇక కొడుకు మోక్షజ్న తెరంగేట్రం విషయంలోనూ అదే ఫార్ములా అనుసరించకుండా ఎందుకుంటాడు.

మోక్షజ్న తెరంగేట్రం 2017లో ఉంటుందని బాలయ్య కొన్నేళ్ల కిందటే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సమయానికి బాలయ్య కొడుకు లాంచింగ్ కు తగ్గ వయసులో ఉంటాడేమో అని అంతా అప్పుడనుకున్నారు. కానీ పర్టికులర్ గా ఈ సంవత్సరమే మోక్షజ్న తెరంగేట్రానికి ఎంచుకోవడానికి కారణం జాతక బలమేనట. ఆస్థాన జ్యోతిష్యులతో సంప్రదించి.. మోక్షజ్న కోసం ఓ ముహూర్తం చూసి పెట్టిన బాలయ్య. ఈ సంగతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పేసాడు. జాతకం ప్రకారమే తన కొడుకును వచ్చే సంవత్సరం అరంగేట్రం చేయిస్తున్నట్లు చెప్పాడు. మోక్షజ్నతో తనతో కలిసి ‘ఆదిత్య 999’లో నటించబోతున్న సంగతి కూడా మరోసారి కన్ఫమ్ చేసిన బాలయ్య తన వందో చిత్రానికి కూడా గట్టి ముహూర్తం నిర్ణయించుకున్నట్లు భోగట్టా.

English summary

Balakrishna launching his son Mokshagna by seeing Horoscope. Nandamuri Mokshagna is now acting with his father in Aditya 999 movie.