ఇండియాటుడే కవర్ పై బాలయ్య

Balakrishna on India Today cover page

03:17 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Balakrishna on India Today cover page

నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ, నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి జానపదం, పౌరాణికం, మరియు సోషియో ఫాంటసీ చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. బాలకృష్ణ ఎన్నో పాత్రల్లో నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాదు ఇటీవలే విడుదలైన 'డిక్టేటర్' చిత్రంతో నేను కుర్ర హీరోలకి ఏ మాత్రం తక్కువ కాదని మరోసారి నిరూపించుకున్నారు. సినిమా లతో పాటు హిందుపురం ఎమ్.ఎల్.ఎ గా కూడా బాలకృష్ణ తన సత్తాని చాటుతున్నారు. అయితే ఇటీవల బాలకృష్ణ తన ఆకతాయి మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే బాలకృష్ణ కి ఒక అరుదైన గౌరవం దక్కనుంది.

అదేంటంటే ఇండియా టూడే కవర్ ఫోటో పై బాలకృష్ణ వచ్చి చేరారు. దీనిని ఏ.పి. సిఎమ్. నారా చంద్రబాబు నాయుడు గారు 3 గంటలకు తన సచివాలయంలో విడుదల చేయనున్నారు. ఈరోజు విడుదల చేయనున్న స్పెషల్ ఎడిషన్ కి సంబంధించిన కవర్ పేజీ పై బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమాలోని లుక్ ను ముద్రించి 'ది లెజెండ్' అనే క్యాప్‌షన్ ని కూడా పెట్టారు. బాలకృష్ణ కి ఇంత అరుదైన గౌరవం దక్కడంతో నందమూరి అభిమానులు ఆనందోత్సవంలో పాల్గొంటున్నారు.

English summary

Balakrishna on India Today cover page. Nandamuri Balakrishna on India Today magazine today cover page as a Legend.