అంజలికి మంచి భవిష్యత్తు ఉందన్న బాలయ్య

Balakrishna Praises Heroine Anjali

10:14 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Balakrishna Praises Heroine Anjali

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో గిలిగింతలు పెట్టిన కధానాయిక అంజలి మరో అడుగు ముందుకేసి, డిక్టేటర్ చిత్రంలో బాలయ్య సరసన నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో యజమాని ఎలా ఉండాలో, సిబ్బందికి ఏ సౌకర్యాలు కల్పించాలో చెప్పి మరీ చేయించి , యజమాని గా నటించిన బాలయ్య చేత మెప్పు పొందిన అంజలి నిజ జీవితంలో కూడా బాలయ్య నుంచి మంచి కామెంట్ అందుకుంది. ‘డిక్టేటర్‌' చిత్ర విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించిన సందర్భంగా, 'అంజలి, సోనాల్‌ మంచి కథానాయికలు. అంజలికి మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి తెలుగు కథానాయిక మన పరిశ్రమలో ఉండడం శుభపరిణామం' అంటూ అంజలిని బాలయ్య తెగ మెచ్చేసుకున్నాడు. ఇక ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధుల్లేవ్.

English summary

Hero Nandamuri Balakrishna says that heroine anjali who was acted as a heroine in dicatator movie.He says that anjali is a very talented and gorgeous actor