బాలకృష్ణని మెప్పించిన నాని

Balakrishna Praises Nani

04:03 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Balakrishna Praises Nani

న్యాచురల్‌ స్టార్‌ నాని 'భలే భలే మగాడివోయ్‌' విజయం తరువాత నటించన తాజా చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని సరసన మెహ్రీన్‌ హీరోయిన్‌ గా నటించింది. ఈ చిత్రం క్రిందటి వారం రిలీజై హిట్‌ టాక్‌ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే 'లెజెండ్‌' చిత్రాన్ని నిర్మించిన '14 రీల్స్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌' సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మించడంతో వాళ్ళ రిక్వెస్ట్‌ మేరకు బాలయ్యకు ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. వాళ్ళ కోరికని మన్నించి వాళ్ళ ఆహ్వానాన్ని స్వీకరించిన బాలకృష్ణ ఆ చిత్రాన్ని చూడటానికి అంగీకరించాడు. ఆ సినిమా చూశాక బాలకృష్ణ నాని పై ప్రశంసలు కురిపించాడు. ఇందులో నాని చాలా అద్భుతంగా నటించాడంటూ కితాబిచ్చాడు. ఈ చిత్రంలో ఎంటర్టైన్‌మెంట్‌ చాలా బాగుంది. ఎక్కడా బోర్‌ కొట్టకుండా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించినందుకు చిత్ర యూనిట్‌ కి నా అభినందనలు అని బాలకృష్ణ చెప్పారు.

English summary

Recently Young Hero Nani Latest Film "Krishna Gadi Veera Prema gadha"movie was super hit at the box office and Nandamuri Balakrishna was invited to watch that movie by the rpoducers of that film.Balakrishna praised Nani and Director and the producers of the movie.