అల్లుడు నారాను అభినందించిన బాలయ్య

Balakrishna Praises Nara Rohit Acting

12:11 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Balakrishna Praises Nara Rohit Acting

నందమూరి - నారా వారి కుటుంబాల నడుమ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం పడిన బంధం ఇంకా కొత్త పుంతలు తొక్కి , మరింత పరిణతి చెబుతోంది. తెలుగువారి హృదయాలలో అన్న గా ముద్ర వేసుకున్న నటుడు- మాజీ సీఎం నందమూరి తారకరామారావు అల్లునిగా నారా చంద్రబాబు వస్తే , రెండవ తరంలో నారా వారి అబ్బాయి లోకేష్ నందమూరి నటసింహం బాలకృష్ణ కు అల్లుడయ్యాడు.

ఇక తన అల్లుడు ని బాలయ్య అభినందించాడు. ఏమి చేసాడని అంటారా? అల్లుడంటే ఇక్కడ లోకేష్ కాదు నారా చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ కూడా బాలయ్యకు అల్లుడు వరసే కదా.

రోహిత్ నటించిన ‘జ్యో అచ్యుతానంద’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించడం సంతోషంగా ఉందని బాలకృష్ణ అన్నాడు. నటుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రలు పోషించిన జ్యో అచ్చుతానంద మూవీ శుక్రవారం విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే. నారా రోహిత్ పనితనం చూస్తుంటే తనకు గర్వంగా ఉందని బాలకృష్ణ మెచ్చుకున్నాడు. అద్భుతమైన నటనతో మరిన్ని మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నానని బాలకృష్ణ అంటున్నాడు. జ్యో అచ్యుతానందలో నారా రోహిత్ పోస్టర్ ను షేర్ చేసి, తన అల్లుడు చేస్తున్న భవిష్యత్ ప్రాజెక్టులకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు బాలయ్య.

ఇది కూడా చూడండి: ఒక్కరోజులో అతిగా శృంగారం చెయ్యడం వల్ల కలిగే నష్టాలు

ఇది కూడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

ఇది కూడా చూడండి: చేతబడి గురించి భయంకర నిజాలు

English summary

Nara Rohit recent film jo achyutananda directed by Srinivas Avasarala . Balakrishna Praises Nara Rohit Acting.