ఎన్టీఆర్‌ కొడుకుగా పుట్టడమే ఓ వరమా 

Balakrishna Praises NTR

12:48 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Balakrishna Praises NTR

అవునని బాలయ్య అంటున్నాడు. నేడు. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ తండ్రిని స్మరించుకున్నాడు.

‘మీ కడుపున జన్మించడం నేను చేసుకున్న గొప్ప వరం. మీ ఆశయ సాధనే నా జీవితం గమ్యం. మీ కలలను నిజం చేస్తాను. మరణం లేని జననం మీది. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అంటూ పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు మీరు. ఓ విశ్వ విఖ్యాతా.. నీ గాధ... నీ బోధ మాకు భగవద్గీత. ఓ విశ్వ విఖ్యాతా... నీ ఘనత, నీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేతా.. అందుకో మా జ్యోతా’ అంటూ నివాళులర్పించారు. అసలే డిక్టేటర్ విజయంతో మంచి జోష్ మీదున్న బాలయ్య ఎన్టిఆర్ తో అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ ఫోటోను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

English summary

Hindupuram MLA , Tollywood Hero Nandamuri Balakrishna says that he weas lucky to born to such a great man Nandamuri Taraka Rama Rao