'పవన్'ని వద్దన్న బాలయ్య!

Balakrishna rejected Pawan Kalyan as a chief guest for Dictator audio

06:40 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Balakrishna rejected Pawan Kalyan as a chief guest for Dictator audio

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం 'డిక్టేటర్‌'. ఈ చిత్రానికి 'లౌక్యం' ఫేమ్‌ శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్‌ చౌహన్‌, అక్ష ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఐటమ్‌సాంగ్‌లో శ్రద్ధాదాస్‌ కనిపించనుంది. ఈ నెల డిక్టేటర్‌ ఆడియోని నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అయిన అమరావతిలో అంగరంగ వైభవంగా విడుదల చేయబోతున్నారు. ఈ ఆడియో వేడుకకి పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ని ముఖ్య అతిధిగా ఆహాన్వించాలని చిత్ర యూనిట్‌ భావించిందట.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా రావడానికి బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశాడట. దీనితో ముఖ్య అతిధిని ఎవరిని పిలవాలా అని చిత్రం యూనిట్‌ సందేహంలో పడిందట. అయితే 2014లో జరిగిన ఓట్లు ఎలక్షన్స్‌లో పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో కృషి చేశారు. కానీ బాలకృష్ణ ఈ విధంగా తిరష్కరించడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ దీనికి కారణం లేకపోలేదు, ఈ ఆడియోకి నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు గారు మఖ్యఅతిధిగా రాబోతున్నారని వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు చంద్రబాబుని కూడా బాలకృష్ణ సున్నితంగా తిరష్కరించారట. ఎందుకంటే డిక్టేటర్‌ ఆడియో వేడుక ఒక సినీ వేడుకలా జరగాలి రాజకీయ వేడుకలా జరగకూడదని బాలకృష్ణ అభిప్రాయమట.

English summary

Balakrishna rejected Pawan Kalyan as a chief guest for Dictator audio launch. Dictator movie is directed by Loukyam fam Srivaas.