ఎన్టీఆర్‌ గుట్టు విప్పిన బాలయ్య!

Balakrishna revealed about Nannaku Prematho issues

04:27 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Balakrishna revealed about Nannaku Prematho issues

సాధారణంగా గొడవలు అనేవి కొన్ని కుటుంబాలలో మామూలే. ఇలాంటి గొడవలు నందమూరి కుటుంబంలో కూడా ఉన్నాయని అందరికీ తెలుసు. బాలకృష్ణ కుటుంబ సభ్యులు, హరికృష్ణ కుటుంబ సభ్యులు మధ్య గత కొంతకాలంగా రాకపోకలు లేవన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణ 'డిక్టేటర్‌', ఎన్టీఆర్‌ 'నాన్నకుప్రేమతో' చిత్రాలు రిలీజ్‌ సమయంలో ఒక గొడవ తలెత్తింది. అదేంటంటే ఎన్టీఆర్‌ నాన్నకుప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్ కంటే ఒకరోజు ముందే సంక్రాంతి కానుకగా విడుదలైంది. తరువాత రోజు 'డిక్టేటర్‌' రిలీజ్‌ సందర్భంగా 'నాన్నకుప్రేమతో' కి బాలయ్య రాజకీయ బలంతో అధిక ధియేటర్స్‌ రాకుండా అడ్డు పడుతున్నాడని వార్తలు వినిపించాయి.

ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌ ని అడిగితే తన కుటుంబ సభ్యులతో అటువంటి విబేధాలేమి లేవని చెప్పాడు. అంతేకాదు మంచి కథతో వస్తే 'బాబాయ్‌ కి ప్రేమతో' అనే చిత్రంలో కూడా నటిస్తానని చెప్పాడు. ఇదే విషయాన్ని బాలకృష్ణ దగ్గర ప్రస్తావిస్తే బాలయ్య ఈ విధంగా స్పందించాడు. నేను వేరే సినిమాలని పట్టించుకోను నాకు ఎవరూ పోటీ కాదు, ధియేటర్స్‌ గొడవ గురించి నాకు తెలీదు, నేను నా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను అని తెలియజేశారు.

English summary

Nandamuri Balakrishna revealed about Young Tiger Ntr Nannaku Prematho thatres issues.