హోదాపై ఘాటుగా స్పందించిన బాలయ్య

Balakrishna shocking comments AP special status

06:15 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Balakrishna shocking comments AP special status

ఏపి ప్రత్యేక హోదా అంశం ప్రజల్లో సెంటిమెంట్ గా మారిన పరిస్థితులలో ఒక్కక్కరు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కొంచెం ఘాటుగానే స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని, అనేసారు. హోదా విషయంలో కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తారని బాలకృష్ణ తెలిపారు. ఏపీ సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని బాలకృష్ణ శ్లోకం రూపంలో వినిపించడం విశేషం.

English summary

Balakrishna shocking comments AP special status